సినీ నటుడు సుమన్ పొలిటికల్ ఎంట్రీ ఆ పార్టీ నుండేనా ?

actor suman,suman

ఆయన చాలా కాలంగా రాజకీయాల్లోకి రావాలని తహతహలాడుతున్నారు. ఏ పార్టీ లో అయితే గెలుపు అవకాశం వుంటుందో అని చూస్తున్నారు. అప్పట్లో ఆ దర్శకేంద్రుడితో చంద్రబాబు పార్టీ లో చేరతానని టికెట్ కావాలని పైరవీ చేయించినా అది సఫలం కాలేదు. దాంతో ఇప్పుడు తెలంగాణలో ఫోకస్ పెట్టాడు. టీఆర్ఎస్ మీద ప్రసంశల జల్లు కురిపిస్తున్నాడు ఆ సినీనటుడు. ఇంతకీ ఆయన ఎవరంటే
సినీ నటుడు సుమన్ రాజకీయ నాయకుడు కావాలని తెగ ఉవ్విళ్ళూరుతున్నారు. అందులోనూ తెలంగాణలో నిన్నటి వరకు అధికార పార్టీ గా ఉన్న టీఆర్ఎస్ తీర్ధం పుచ్చుకోవాలని అనుకుంటున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజకీయాల్లో పెద్దగా స్టార్ ల కోసం ఫోకస్ పెట్టిన దాఖలాలు లేవు. తమ పార్టీ లో సినీ ఇండస్ట్రీ నుండి వచ్చిన వారిని చేర్చుకున్న దాఖలాలు కూడా పెద్దగా లేవు. మొన్నటి వరకు ఒక్క బాబు మోహన్ తప్ప రాజకీయ పార్టీ గా ఏర్పడిన నాటి నుండి నేటి వరకు సినిమా వాళ్ళను పెద్దగా దగ్గరకు రానివ్వలేదు కేసీఆర్. ఎందుకంటే ఆయన రూటే సపరేటు. కానీ కేసీఆర్ తనయుడు కేటీఆర్ మాత్రం స్టార్ హీరోలతో సన్నిహిత సంబంధాలు నెరపుతున్నారు.ముఖ్యంగా మహేష్, విజయ్ దేవరకొండలతో కేటిఆర్ కు సాన్నిహిత్యం చాలా ఎక్కువ. సినీ వర్గాలతో మంచి క్లోజ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు కేటీఆర్ .
ఇప్పుడు తాజాగా సుమన్ సైతం టీఆర్ఎస్ లో చేరాలని తహతహలాడుతున్నారు. ఆ విషయాన్ని బాహాటంగా చెప్తున్నారు.విశాఖలో ఓ కార్యక్రమానికి వచ్చిన ఆయన టీఆర్ఎస్ ను తెగ పొగిడేశారు. తన మద్దతు కేసీఆర్ కే నని చెప్పి కేసిఆర్ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారని పేర్కొన్నారు. ఆయనకే తన పూర్తి సపోర్ట్ అని చెప్పి టీఆర్ఎస్ లో చేరి కారు ఎక్కాలనే తన కోరికను బయటపెట్టారు. ఇంతకు ముందు కూడ పలుసార్లు కేసిఆర్ ను సపోర్ట్ చేస్తూ మాట్లాడిన సుమన్ ఇంకొన్ని రోజుల్లో గులాబీ కండువా కప్పుకోవాలని భావిస్తున్నారు. గులాబీ దండులో చేరాలని బాగా కుతూహలంతో ఉన్న సుమన్ ను పార్టీ లో చేర్చుకుంటారా లేదా అనేది గులాబీ బాస్ తేల్చాలి.

#Suman #ActorSuman #PolitiCs