గుణశేఖర్ హిరణ్యకసిప కి 500 కోట్లా

gunasekhar new movie hiranyakashyap,gunasekhar new movie,director gunasekhar next movie,gunasekhar movies,trendingandhra

టాలీవుడ్ సీనియ‌ర్ ద‌ర్శ‌కులు గుణ‌శేఖ‌ర్ డ్రీమ్ ప్రాజెక్ట్ హిర‌ణ్య‌క‌సిప‌. భారీ సెట్స్ నిర్మించడంలో గుణశేఖర్ సిద్ధహస్తుడు. ఈ సినిమాని ప్ర‌క‌టించి ఇప్ప‌టికే చాలా కాల‌మైంది. రానా ప్ర‌ధాన పాత్ర‌లో హిర‌ణ్య‌క‌సిప లాంటి భారీ ప్రాజెక్టును తెర‌కెక్కించే ఆలోచ‌న ఉంద‌ని అప్పట్లో గుణశేఖర్ ప్రకటించాడు. ప్ర‌శ్న నేడు అదుగో ప్ర‌మోష‌న్ వేడుక‌లో పాత్రికేయులు సంధిస్తే నిర్మాత డి.సురేష్‌ బాబు షాకిచ్చే సంగ‌తులే చెప్పారు. హిర‌ణ్య‌క‌సిప కోసం ఎక్కువ మంది ప‌ని చేస్తున్నారు. ఓవైపు గుణ‌శేఖ‌ర్ ఆఫీస్‌ లో వ‌ర్క్ జ‌ర‌గుతోంది. రామానాయుడు స్యుడియో లో కూడా అన్నిచోట్లా ప‌ని జరుగుతుంది. లండ‌న్ ఆఫీస్‌ లోనూ దీనికి సంబంధించిన ప‌ని చేస్తున్నారు. ఈ సినిమాని ఇండియా లెవ‌ల్లో,వ‌ర‌ల్డ్ సినిమా స్టాండార్డ్స్‌ తో తెర‌కెక్కించే ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం. అన్ని భాష‌ల్లోనూ రిలీజ్ చేసే ఆలోచ‌న ఉంది. దీనికి రానానే నిర్మాత‌.. న‌టుడు.. ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ అంతా తానే. వీఎఫ్ ఎక్స్ బేస్డ్ సినిమాలంటే రానాకు చాలా ఇష్టం. కామిక్స్ ని అమితంగా ఇష్ట‌ప‌డ‌తాడు. అమ‌ర్‌ చిత్ర క‌థ పుస్త‌కాల‌కు అభిమాని. అందుకే సాంకేతికంగా బెస్ట్ సినిమాల్లో న‌టించేందుకు ఆస‌క్తి చూపిస్తున్నాడు.. అని తెలిపారు.వాస్త‌వానికి భార‌త‌దేశంలోని అన్ని భాష‌ల్లో రిలీజ్ చేసేంత పెద్ద కాన్వాసుతో ఈ చిత్రాన్ని తీయాల‌న్న ఆలోచ‌న ఉంది.. అందుకు త‌గ్గ‌ట్టే ఈ సినిమా కోసం భారీ బ‌డ్జెట్ నే కేటాయించ‌నున్నార‌ట‌. భారీ వీఎఫ్ ఎక్స్ తో ముడిప‌డి ఉంది కాబ‌ట్టి స‌మ‌యం అంతే ఎక్కువ తీసుకుంటుంద‌ని అర్థ‌మ‌వుతోంది. ఇది కేవ‌లం తెలుగు భాష వ‌ర‌కే కాదు – ఇత‌ర మార్కెట్ల‌ను దృష్టిలో ఉంచుకుని తీసే సినిమా. రానా అండ్ గుణశేఖర్ టీం ఇప్పటికే హిరణ్యకసిప టైటిల్ ను ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించాడు.

#GunasekharNewMovieHiranyakashyap #GunasekharNewMovie