గుండు హనుమంతరావుకు కన్నీటి వీడ్కోలు..!

హాస్యనటుడు గుండు హనుమంతరావు అంత్యక్రియలు పూర్తయ్యాయి.ఎర్రగడ్డలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.

ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.దీంతో ఇవాళ తెల్లవారుజామున మూడున్నరకు హైదరాబాద్‌లో మృతి చెందారు.గుండు హనుమంతరావు 1956, అక్టోబర్‌ 10న విజయవాడలో జన్మించారు. సినిమాల్లోకి రాకముందు కొన్నేళ్లు మిఠాయి వ్యాపారం చేశారు. అనంతరం ‘సత్యాగ్రహం’చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసి సుమారు 400లకు పైగా సినిమాల్లో నటించారు.

‘అహ నాపెళ్లంట’ మాయలోడు,రాజేంద్రుడు గజేంద్రుడు,యమలీల,టాప్‌ హీరో,కొబ్బరి బోండాం, బాబాయ్‌ హోటల్‌, శుభలగ్నం,క్రిమినల్‌, పెళ్లాం ఊరెళితే తదితర చిత్రాల్లో అద్భత నటన కనబర్చారు.గుండు హనుమంతరావు మారణం తీరని లోటని మెగాస్టార్ చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు.ఇండస్ట్రీ ప్రముఖులు గుండు హనుమంతరావుకు సంతాపం తెలిపారు.