బిర్యానీ రూ.120 , టీ రూ.10 …ఎక్కడో తెలుసా …!

biryani,chicken biryani,egg biryani,mutton biryani,Trendingandhra

గత సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఆహార పదార్థాల ధరలు తగ్గించగా, ఎన్నికల ప్రచారంలో ప్రధానమైన టెంట్‌హౌస్‌, సౌండ్‌ బాక్స్‌లు, అద్దె వాహనాలు, బ్యానర్లు, కరపత్రాలు, హోర్డింగ్‌ల ధరలు మాత్రం భారీగా పెంచారు. ప్రతిపాదిత ధరలపై రాజకీయ పార్టీల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే కొన్నింటి ధరలు ఎక్కువగా ఉన్నాయని, తగ్గించాలని అభిప్రాయపడ్డారు. జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎన్నికల అధికారి ఎం. దానకిషోర్‌ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.

2014లో ధరలు, ప్రస్తుత ప్రతిపాదిత ధరలపై చర్చించారు. ఆహార పదార్థాల ధరలు తగ్గించిన అధికారులు ఇతర ప్రచార సామగ్రి, ఇతర ఖర్చులను పెంచాలని నిర్ణయించారు. సగటున 20 శాతం అదనంగా ధరలు నిర్ణయించారు. జీహెచ్‌ఎంసీ నిర్ణయించిన ధరలపై పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. రెండు బాక్స్‌ల అద్దె రూ.1,500 నుంచి రూ.2,000 వరకు మాత్రమే ఉంటుందని, దాదాపు రెట్టింపు నిర్ణయించడం సమంజసం కాదని అభిప్రాయపడ్డారు. ప్రచారంలో ప్రధానంగా వినియోగించే బాక్స్‌లు, టెంట్‌ హౌస్‌, బ్యానర్లు, కరపత్రాలు, బంటింగ్‌లు, అద్దె వాహనాల ధరలు పెంచడం వల్ల ఖర్చు నిర్ణీత స్థాయిని మించిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రచార సామగ్రి, వస్తువుల ధరలు 20 శాతం పెంచిన అధికారులు ఆహార ధరలు మాత్రం తక్కువగా ప్రతిపాదించారు. 750 గ్రాముల చికెన్‌ బిర్యానీ ధర 2014లో రూ.140గా ఉండగా, ఇప్పుడు రూ.120గా, ఎగ్‌ బిర్యానీ నాడు రూ.120 ఉండగా, రూ.100గా ప్రతిపాదించారు. మటన్‌ బిర్యానీ రూ.170 నుంచి రూ.140కి తగ్గిస్తు ధరల పట్టిక సూత్రప్రాయంగా రూపొందించారు. ఇడ్లీ, వడ, వెజ్‌ ఫ్రైడ్‌ రైస్‌, మీల్స్‌ ధరలూ తక్కువగా ప్రతిపాదించారు. అరలీటర్‌ వాటర్‌ బాటిల్‌ ధర గతంలో రూ. ఉండగా, రూ. 10కి పెంచారు. ప్రతిపాదిత ధరలపై రాజకీయ పార్టీలతో చర్చించిన అధికారులు ఎన్నికల సంఘం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లి ధరలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు.

#BiryaniRs120Tea10KnowWhereItIs #Biryani #ChickenBiryani #EggBiryani #MuttonBiryani