సాంబారుతో క్యాన్సర్‌కు చెక్ ……ఎలానో చూడండి..!

samber , cancer , TrendingAndhra

సాంబారుతో క్యాన్సర్‌ను ఎదుర్కోవచ్చా? అదెలా సాధ్యం అని ఆశ్చర్యపోతున్నారా? తాజా పరిశోధనల్లో సాంబారు క్యాన్సర్ నియంత్రణకు ఎలా ఉపయోగపడుతుందో తేలింది. రొమ్ము, ఊపిరితీత్తుల క్యాన్సర్‌తో పాటు పెద్ద ప్రేగు క్యాన్సర్ కూడా ప్రపంచాన్ని పీడిస్తోంది.
ఈ నేపథ్యంలో దక్షిణాది వంటకమైన ‘సాంబారు’.. పెద్ద ప్రేగు క్యాన్సర్‌ నియంత్రణకు ఉపయోగపడుతుందని పరిశోధనల్లో తేలింది. ఉత్తర భారత దేశంలో 70 శాతం మంది పెద్ద ప్రేగు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.

అయితే, సాంబారు ఆహారంగా తీసుకునే దక్షిణాదిలో మాత్రం ఈ సమస్య చాలా తక్కువగా ఉందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. సాంబారులో వేసే క్యారెట్, బెండకాయలు, దొండకాయలు, మునగకాయలు, టమోటాలు, వంకాయలు తదితరాల వల్ల శరీరానికి కావల్సిన ఫైబర్ ఇతరాత్ర పోషకాలు అందుతున్నాయని పేర్కొన్నారు. సాంబారులో రుచి కోసం వినియోగించే మసాలాలకు క్యాన్సర్ అడ్డుకునే శక్తి ఉందని మణిపాల్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు.

సాంబారులో వినియోగించే దనియాలు, వెల్లులిపాయలు, పసుపు, నల్ల మిరియాలు, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, ఎండి మిర్చి వంటి మసాలా దినుసులకు క్యాన్సర్ గడ్డలను నియంత్రించే శక్తి ఉందని తెలిపారు.

అమెరికా ఫుడ్ & డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) సైతం సాంబారులో వాడే మసాలాల వివరాలు సేకరించింది. ఇంకెందుకు ఆలస్యం! ఇక రుచికరమైన సాంబారును ఆస్వాదిస్తూ ఆరోగ్యంగా ఉండండి.