హలో గురు ప్రేమకోసమే…..” హా..హాట్‌గా ఉంది “…!

టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో రామ్ మరో సారి హలో గురు ప్రేమకోసమే అంటూ మన ముందుకు రాబోతున్నాడు . గత కొంత కాలంగా సరైన హిట్ లేక సతమతమౌతున్న రామ్ ఈ సినిమాతో ఆ కోరికని తీర్చుకునేలా ఉన్నట్టు కనిపిస్తుంది . రామ్ తాజా చిత్రం హలో గురు ప్రేమకోసమే నుండి కొద్దిసేపటి క్రితం టీజర్ రిలీజ్ చేసారు చిత్ర యూనిట్ .

ఇందులో రామ్ ని చూస్తే , రామ్ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా రెడీ సినిమాలోని రామ్ గుర్తుకువచ్చేలా ఉన్నాడు . ఇక ఈ టీజర్ ని ఒకసారి గమనిస్తే ….” రామ్ .అనుపమ చాల క్యూట్ గా కనిపిస్తున్నారు . అనుపమ తన అందాలతో పిచ్చెక్కిస్తుంది . ఈ టీజర్‌లో హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ తన బ్యాక్ మొత్తం కనిపించేలా కూర్చుని.. తన హెయిర్‌ని సరిచేసుకుంటూ ఉంటే వెనుక నుంచి వచ్చిన రామ్ఆమెనే చూస్తూ ఉండిపోతాడు. ‘చూశావా.. నీకోసమే..’ అని అనుపమ అనగానే ఆశ్చర్యపోతాడు రామ్. వెంటనే ‘కాఫీ నీ కోసమే’ అని అనుపమ చెబుతుంది. ఎలా ఉంది. అని అనుపమ అడుగగ ‘హా..హాట్‌గా ఉంది..’ అంటూ రామ్ సమాధానమిస్తాడు. టోటల్‌గా ఇద్దరూ ఫ్రెష్‌లుక్‌లో కనిపించిన ఈ టీజర్ సినిమాలో మంచి లవ్ స్టోరీ ఉన్నట్లుగా తెలుస్తుంది .

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సెన్సిబుల్, క్యూట్ ప్రేమ క‌థా చిత్రం కావ‌డంతో సినిమాపై మంచి అంచ‌నాలు నెల‌కొన్నాయి. ‘సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్’ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథ‌రావు న‌క్కిన ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది.