రికార్డులు తిరగరాస్తున్న …..హలో గురు ప్రేమకోసమే టీజర్ ….!

టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా, హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు కాంబినేషన్‌లో రూపొందుతోన్న లవ్ ఎంటర్‌టైనర్ ‘హలో గురు ప్రేమకోసమే’. పలు విజయవంతమైన చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

పూర్తిగా సెన్సిబుల్, క్యూట్ ప్రేమ కథా చిత్రం కావడంతో సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రం లో అనుపమ పరమేశ్వరన్, ప్రణీత హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ‘సినిమా చూపిస్త మావ, నేను లోకల్’ చిత్రాల దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 18న దసరా కానుకగా విడుదల చేయడానికి నిర్మాత దిల్ రాజు సన్నాహాలు చేస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్ 3 గంటల్లో 5 లక్షల వ్యూస్‌ని, 6 గంటలలోపే 1 మిలియన్ వ్యూస్‌ని రాబట్టి రికార్డు సృష్టించింది. టీజర్ సోషల్‌ మీడియాలో ఇంత పెద్ద సక్సెస్ అవ్వడంతో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీనితో సినిమా పై కూడా అంచనాలు తార స్థాయి కి చేరుకున్నాయి .