ఒక కెమిస్ట్రీ టీచర్‌ వెడ్డింగ్‌ కార్డుపై… శశిథరూర్…ట్వీట్

A chemistry teacher's wedding card... Shashi Tharoor... Tweet, Trending Andhraప్రతిఒక్కరి లైఫ్ లో ఎంతో ఉన్నతమైన వేడుక అందుకే స్త్రీ, పురుషులు   ఇద్దరిని ఒక్కటి చేయడానికి రెండు కుటుంబాల మధ్య ఏర్పడే సంబంధాలు, సంతోషాలు, భావాలు అన్ని ఇన్ని కాదు. జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఈ  వేడుకనీ . ఎవరు మాత్రం సింపుల్ గా చేసుకుంటారు. అందుకే ఈ వేడుకను ఎప్పటికి గుర్తుండిపోయే విధంగా జరుపుకునేందుకు చాలా మంది యువతి, యువకులు ఉత్సహం కనబరస్తారు. ఫొటో సెషన్లు, సంగీత్‌లు, వెడ్డింగ్‌ కార్డులు.. ఇలా ప్రతిది ఆకట్టుకునేలా ఉండేలా ప్రణాళికలు రచిస్తున్నారు. తాజాగా కేరళకు చెందిన ఓ కెమిస్ట్రీ టీచర్‌ తన వివాహ ఆహ్వాన పత్రికను వినూత్నంగా రూపొందించడంతో అది కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అందరి దృష్టిని ఆకర్షించే విధంగా ఆమె డిజైన్ చేసిన ఈ వివాహ పత్రిక ఇపుడు ప్రముఖుల మన్ననలు కూడా పొందింది.

Image result for shashi tharoor

ఇది అంతా జరిగింది  కేరళలోని తిరువనంతపురానికి చెందిన విథున్ అనే కెమిస్ట్రీ టీచర్ డిసెంబర్ 14న సూర్య అనే వ్యక్తితో పెళ్లి జరగనుంది. కెమిస్ట్రీ టీచర్ అయిన విథున్ తన పెళ్లి పత్రికను కూడా ఆమె బోధిస్తున్న సబ్జెక్ట్  ముడిపడి ఉండేలా రూపొందించారు. ఈ వెడ్డింగ్ కార్డును ఆర్గానిక్ కెమిస్ర్టీలోని రసాయనబంధాలను గుర్తుకు తెచ్చేలా రూపొందించారు. అందులో లవ్(LOVE) అనే పదాలను కూడా అందంగా పొందుపర్చారు. వధువరుల పేర్లు కూడా కెమిస్ట్రీ   లుక్‌లోనే  డిజైన్ చేశారు. మరి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. పెళ్లిని రియాక్షన్(చర్య)గా, కళ్యాణ వేదికను ల్యాబోరేటరిగా పేర్కొన్నారు. ఈ రకమైన క్రియేటివిటీ తో ఆమె వెడ్డింగ్ కార్డ్ తీర్చి దిద్దిన విధానం అక్కడి వారందరినీ ఆకర్షించింది. విథున్ సృజనాత్మకతపై నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

వెడ్డింగ్ కార్డ్ పై ట్వీట్ చేసిన శశిథరూర్….

సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వెడ్డింగ్‌ కార్డును కార్తీక్‌ వినోబా అనే వ్యక్తి కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ను ట్యాగ్‌ చేస్తూ ట్విటర్‌లో పోస్ట్‌ చేశాడు. మీ నియోజకవర్గంలోని ఓ కెమిస్ట్రీ టీచర్‌ వెడ్డింగ్‌ కార్డు ఇది అని కార్తీక్‌ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దీనిపై శశిథరూర్‌ రీ ట్వీట్ పెట్టడం  అందులో  చమత్కారంగా ఆ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.