బాబు విశాఖ ప‌ర్య‌ట‌న‌ను దేశం మొత్తం చూస్తోంది.. ఎందుకో తెలుసా..?

 
Babu visits Visakhapatnam across the country .. Do you know why?, Trending Andhra
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్య‌క్షులు,  ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఇవాళ విశాఖ‌ప‌ట్నం జిల్లాలో ముమ్మ‌రంగా ప‌ర్య‌టించ‌నున్నారు. ప‌ర్య‌ట‌న‌లో భాగంగా పెద‌గంట్యాడ మెడెటెక్ జోన్‌లో కొత్త‌గా నిర్మించిన వైద్య ప‌రిక‌రాల కంపెనీని చంద్ర‌బాబు ప్రారంభించ‌నున్నారు. అంతేకాకుండా, భీమిలి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో 3వేల కోట్ల రూపాయ‌ల అభివృద్ధి ప‌నుల‌కు సీఎం చంద్ర‌బాబు శంకుస్థాప‌న చేయ‌నున్నారు.
 
అయితే, ఇప్ప‌టికే విశాఖ మ‌న్యంలో మావోయిస్టుల క‌ద‌లిక‌లు ఉన్న‌ట్టు స‌మాచారం అందుకున్న పోలీసులు సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో అలెర్ట్ అయ్యారు. భారీగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేప‌ట్టారు. విజ‌య‌వాడ నుంచి చంద్ర‌బాబు ప్ర‌త్యేక విమానంలో బ‌య‌ల్దేరి విశాఖకు చేరిన‌ప్ప‌ట్నుంచి తీసుకోవాల్సిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌పై పోలీసులు స‌మీక్ష‌లు జ‌రిపారు. 
 
Image result for chandrababu
విశాఖ‌ప‌ట్నంకు చేరుకోనున్న చంద్ర‌బాబు అక్క‌డ్నుంచి ప్ర‌త్యేక హెలికాప్ట‌ర్‌లో పెద‌గంట్యాడ‌కు చేరుకోనున్నారు. పెద గంట్యాడ‌లో 270 ఎక‌రాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన దేశంలోనే తొలి మెట్‌టెక్ జోన్‌ను చంద్రబాబు ప్రారంభించ‌నున్నారు. ఇందులో 18 హైయ్యెండ్ టెస్టింగ్ రీసెర్చ్ ల్యాబ‌రేట‌రీలు, వ‌ర‌ల్డ్ వైడ్ కౌన్సిల్స్‌, అత్యాధునిక వైద్య ప‌రిక‌రాలు త‌యారుచేసే 14 కంపెనీలు ఉన్నాయి. అనంత‌రం మెడిక‌ల్ డివైసెస్‌పై వ‌ర‌ల్డ్ హెల్త్ ఆర్గ‌నైజేష‌న్ నిర్వ‌హిస్తున్న స‌ద‌స్సులో చంద్ర‌బాబు పాల్గొని ప్ర‌సంగించ‌నున్నారు. ఇలా విశాఖ జిల్లాలో సీఎం చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో జిల్లా యంత్రాంతం క‌ట్టుదిట్ట‌మైన ఏర్పాట్ల‌ను చేసింది.