‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కుంటున్న బాలీవుడ్ సింగర్ ….. వెనకేసుకోస్తున్న మరో సింగర్…?

Bollywood singer facing charges 'Me To' , Trendingandhra

బాలీవుడ్‌ నుంచి కోలీవుడ్ దాకా తాకిన సెగ “మీటూ’
ఉద్యమమ్ ఈ నేపథ్యంలో బాలీవుడ్ గాయకుడు అనూ మాలిక్‌ కూడా ‘మీటూ’ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆయన లైంగికంగా వేధించారని సింగర్స్‌ సోనా మొహాపత్రా, శ్వేతా పండిత్‌ ఆరోపించడం జరిగింది. వీరిద్దరు బయటపడి తమకు ఎదురైన సంఘటల్ని చెప్పిన తర్వాత మరో ఇద్దరు మహిళలు కూడా అనూ మాలిక్‌ గతంలో వేధించాడు చెప్పడం జరిగింది.

ఈ విషయంలో భాగంగా
తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో అనూ మాలిక్‌ వేధింపుల గురించి ప్రముఖ గాయకుడు సోనూ నిగమ్‌ను మీడియా అడిగిన ప్రశ్నలకు. ఆయన స్పందిస్తూ.. ‘‘మీటూ’ గురించి మాట్లాడే అవకాశం నాకు రాలేదు. కొందరు అధికారాన్ని, అవకాశాల్ని ఎలా తప్పుదారిలో వాడుకుంటున్నారో నేను ప్రత్యక్షంగా చూశా. ‘మీటూ’ గురించి నేను పదేళ్ల క్రితం చెప్పా.. అప్పుడు ఓ జర్నలిస్టు బెదిరింపులకు దిగాడు. ఓ దర్శకుడికి ‘మీరు సోనూతో కలిసి పనిచేస్తే నేను చనిపోతాను’ అని నన్ను హెచ్చరించాడు’.

Image result for Anu malik

‘‘ఇవాళ నన్ను అనూ మాలిక్‌ కలిశారు’ అని మీరు అనొచ్చు. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు అలా చెప్పకూడదు. దీని గురించి కూడా మనం ఆలోచించాలి. అనూ మాలిక్‌ కూడా ఆరోపణలు చేయాలి అనుకుంటో.. ఎన్నో చేయొచ్చు. కానీ ఆయన అలా మాట్లాడలేదు. ఆయన నాతో తప్పుగా ప్రవర్తించారని నేను చెబితే.. మీరు ముందు ఆధారాలు అడుగుతారు. కానీ కొందరి ఆరోపణల్లో ఆధారాలు లేవు.. అలాంటప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రజలు గౌరవిస్తారు’.

ఆయన నోటి వద్ద కూడును ఎలా లాగేసుకుంటారు? ఆయన కుటుంబాన్ని ఎలా టార్చర్‌ పెడుతారు?. సరైన ఆధారాలు లేకుండా మరొకరి జీవితాన్ని ఎలా నిర్ధారిస్తారు. నాకు ఇద్దరు సోదరీమణులు ఉన్నారు. వారికి అండగా నేను ఎప్పుడూ ఉంటాను. దీని అర్థం నేను మరొకరి పనికి అడ్డుగా ఉంటానని కాదు. వేధింపులు, హింస అన్నీ చోట్లా జరుగుతుంటాయి. ఇక్కడ మీరు ఆయన్ను (అనూ మాలిక్) నిందించారు, అవమానించారు.. కానీ ఆయన కుటుంబాన్ని శిక్షించొద్దు. ముందు ఆధారాలు తీసుకురండి’ అని చెప్పారు.

ఆరోపణలు ఎదర్కొంటున్నా వారందరూ దోషులు కారని… దానిపై సరి అయిన ఆధారాలు రుజువు అయ్యేవరకు నిందితుల్ని కూడా తాను గౌరవిస్తా..అని సోనూ నిగమ్‌ చెప్పడం జరిగింది.ఇదే రకంగా చాలా సిని పరిశ్రమల్లో పని చేసే వారిపై ఈ రకమైన ఆరోపణలు ఏదో ఒక విధంగా వార్తల్లో నిలుస్తూ వస్తున్నాయి. దీనిపై గతంలోనే కమల్ హాసన్ వంటి నటుడు కూడా స్పందించాడు. సరిఅయిన ఆధారాలు ఉంటే తాను వారి పక్షం నిలుస్తాను అని చెప్పడం జరిగింది.