ఫేస్‌బుక్‌పై హ్యాకర్ల దాడి …..!

face book , facebook hacked , trendingandhra

ఫేస్‌బుక్‌ మరోసారి హ్యాకింగ్‌కు గురైంది. వెబ్‌సైట్‌ భద్రత వ్యవస్థలోని ఓ లోపాన్ని వినియోగించుకుని.. దాదాపు 5 కోట్ల ఖాతాల ‘యాక్సెస్‌ టోకెన్స్‌’ను హ్యాకర్లు చోరీ చేశారు. ఈ యాక్సెస్‌ టోకెన్‌ ద్వారా.. ఖాతాదారుల సమాచారాన్ని చూడొచ్చు.

facebook hacked , trendingandhra

మంగళవారం ఈ లోపాన్ని గుర్తించామని.. గురువారం రాత్రికి సరిచేశామని ఫేస్‌బుక్‌ సీఈఓ మార్క్‌ జుకర్‌బర్గ్‌ తెలిపారు. వినియోగదారుల ఖాతాలేవైనా దుర్వినియోగమయ్యాయా అన్న సంగతి ఇంకా తెలియదని చెప్పారు. ఇది తీవ్రమైన సమస్యేనని ఆయన పేర్కొన్నారు. ఇతరులకు మన ఖాతా ఎలా కనిపిస్తుందన్నది తెలుసుకునేందుకు వీలు కల్పించే ‘వ్యూ ఆజ్‌’ ఫీచర్‌లో ఈ లోపం ఉందని.

mark zuckerberg, facebook , trendingandhra

దీన్ని తాత్కాలికంగా నిలిపివేశామని చెప్పారు. ఈ ఫీచర్‌ను వినియోగించిన 4 కోట్ల ఖాతాదారుల యాక్సెస్‌ టోకెన్లను.. ముందుజాగ్రత్త చర్యగా మార్చివేశామని ఫేస్‌బుక్‌ పేర్కొంది. హ్యాకింగ్‌ ఘటనపై సంబంధిత ప్రభుత్వ విభాగానికి ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.