సెంచరీ వైపు శరవేగంగా సాగుతున్న పెట్రోల్ ధరలు

petrol rates , fuel rates , trendingandhra

గడిచిన ముప్పై రోజులుగా భగ్గుమం టున్న పెట్రోల్‌ ధరలు వంద రూపాయలకు చేరువవు తున్నాయి. నెల రోజులుగా విరామం లేకుండా పెరుగుతున్న పెట్రో ఉత్పత్తుల ధరలు మంగళవారం కూడా కొనసాగాయి.

petrol rates , trendingandhra

సోమవారంతో పోల్చితే పెట్రోల్‌ రూ.0.14, డీజిల్‌ రూ. 0.11 పైసలు పైకి ఎగబా కాయి. సవరించిన ధరల ప్రకారం.. దేశ ఆర్థిక రాజ ధాని ముంబయిలో పెట్రోల్‌ రూ. 90.22, డీజిల్‌ రూ. 78.69గా నమోదై అత్యంత గరిష్ట స్థాయికి చేరుకుంది. ముంబయి మినహా మహారాష్ట్రలోని పది జిల్లాల్లో పెట్రోల్‌ ధరలు దాదాపు రూ.92 కు చేరి సెంచరీ వైపునకు వేగంగా పయనిస్తున్నాయి.

దేశ రాజధానిలో లీటరు పెట్రోల్‌ రూ. 82.16, డీజిల్‌ రూ. 74.12కు చేరుకుంది. ఇవే ధరలు హైదరాబాద్‌లో రూ. 87.84, డీజిల్‌ రూ. 80.62గా నమోదయ్యాయి.