రోడ్డు ప్రమాదంలో ‘గీతం’ అధినేత మూర్తి దుర్మరణం …..!

Gitam Chairman , MVVS Murthy ,TrendingAndhra

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గీతం విశ్వవిద్యాలయం అధినేత, తెదేపా ఎమ్మెల్సీ ఎంవీవీఎస్‌ మూర్తి కన్నుమూశారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం ఆయన కాలిఫోర్నియా నుంచి అలస్కాలోని ఆంకరేజ్‌‌ సఫారీని సందర్శించేందుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

geethams president , MVVS Murthy , trendingandhra

వీరు ప్రయాణిస్తున్న వ్యాను ఎదురుగా వస్తున్న ట్రక్కును ఢీకొంది. ప్రమాద సమయంలో ఆయనతోపాటు కారులో ప్రయాణిస్తున్న వెలువోలు బసవపున్నయ్య, వీరమాచినేని శివప్రసాద్, వి.బి.ఆర్‌ చౌదరి మృతి చెందగా.. కడియాల వెంకటరత్నం(గాంధీ) తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న తానా సభ్యులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఈ నెల 6వ తేదీన కాలిఫోర్నియా జరగనున్న గీతం పూర్వవిద్యార్థుల సమావేశంలో ఆయన ప్రసంగించాల్సి ఉంది.