రాయదుర్గం సమీపంలోని..” హీరో ప్రభాస్ గెస్ట్ హౌజ్ సీజ్ “చేసిన రెవిన్యూ అధికారులు.

 Hero Prabhas Guest House Siege "Revenue Officers, Trendingandhra
నిన్న మొన్నటి వరకు రాష్ట్రంలో ఎన్నికల నేపద్యంలో కామ్ గా ఉన్న రెవెన్యూ శాఖ, ఇపుడు మాత్రమ్ ప్రభుత్వ స్థలాల్లో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికారులు  కొరడా ఝుళిపించారు. హైదరాబాద్‌ శివారు ప్రాంతం రాయదుర్గం సమీపంలో  ‘పైగా’ మరి కొన్ని ప్రాంతాల్లోని భూముల్లో వెలసిన నిర్మాణాలను రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. ఈ కూల్చి వేతలో అక్కడ కొందరి ప్రముఖులకు సంబంధించిన భూములు కూడా ఉండడం. 
 
 ముఖ్యంగా ఆ ప్రాంతంలో ఉన్న  భూముల్లో ప్రముఖ సినీహీరో ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ను కూడా సీజ్‌ చేయడం జరిగింది. రాయదుర్గం పైగా భూముల్లో సర్వే నంబరు 46లో 84.30 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలంపై ప్రభుత్వం, ప్రైవేటు వ్యక్తుల మధ్య సుప్రీంకోర్టులో వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో  దానిపై న్యాయస్థానం తన తీర్పు కూడా మూడునెలల కిందట  ఆ భూమి ప్రభుత్వానిదేనని తీర్పు ప్రకటించడం జరిగింది. 
 
Image result for Prabhas
అయితే ఇక్కడ గతంలోనే పశువుల పాకలు, ఇతర నిర్మాణాలు చేపట్టగా. సమీపంలోనే ప్రభాస్‌ గెస్ట్‌హౌస్‌ ఉంది. ఎన్నికల నేపథ్యంలో అధికారులు కొన్నాళ్లు ఆక్రమణల తొలగింపు చర్యలు చేపట్టలేదు. తాజాగా సోమవారం శేరిలింగంపల్లి తహసీల్దార్‌ వాసుచంద్ర, సిబ్బంది ఆ స్థలంలోని పాకలు, ప్రహరీలను జేసీబీల సహాయంతో కూల్చివేశారు. ప్రభాస్‌ అతిథిగృహం వద్ద ఎవరూ అందుబాటులో లేకపోవడంతో గేటుకు నోటీసు అంటించి సీజ్‌ చేశారు. ప్రభుత్వ స్థలమని పేర్కొనే సూచికలను ఏర్పాటుచేశారు. త్వరలోనే ఆ స్థలానికి రక్షణ ఏర్పాట్లు చేస్తామని తహసీల్దార్‌ చెప్పారు.
 
బిజీ  సినిమా షెడ్యూల్స్ తో ఉన్న ప్రభాస్ 
ఇక దీనిపై  ఎలా స్పందిస్తారో మరి.. అధికారికంగా చేసిన ఈ పని ,ఆయన దృష్టికి వెళ్లిందా..లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. చట్టపరంగా ఈ సమస్యను అధిగమిస్తార,లేక వదిలేస్తారా తెలియాలి అంటే కొద్ది రోజులు ఆగవలసిందే.