కంగనా రనౌత్‌ “మణికర్ణిక” ట్రైలర్ రిలీజ్…

Kangana Ranaut "Manikarnika" Trailer Release.. Trendingandhra

ఇప్పటికే మన దేశంలో అన్ని భాషల్లోనూ కనిపిస్తున్న ట్రెండ్  హిస్టారికల్ పీరియాడిక్ అండ్ బయోగ్రఫీ మూవీస్ ఇప్పటివరకు ఇలా రిలీస్ అయిన ప్రతి మూవీ సూపర్ హిట్ కావడంతో మరిన్ని సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలోబాలీవుడ్‌ ‘క్వీన్‌’ కంగనా రనౌత్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తున్న చిత్రం ‘మణికర్ణిక’ (ది క్వీన్‌ ఆఫ్‌ ఝాన్సీ)’. క్రిష్‌ జాగర్లమూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి జీవితాధారంగా ఈ చారిత్రక చిత్రాన్ని తెరకెక్కించారు. అయితే..ఈరోజు ఈ ప్రతిష్ఠాత్మక చిత్ర ట్రైలర్‌ను విడుదల  చేయడం జరిగింది.

‘ఝాన్సీ ప్రాంతంపై బ్రిటిషర్ల కన్నుపడింది. ఒకవేళ ఝాన్సీని కాపాడే అధికారి రాకపోతే ఈ ప్రాంతాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది’ అని ఓ మహిళ చెబుతున్న డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలవుతుంది. అప్పుడు ఓ వ్యక్తి వచ్చి..‘నేను ఇందాక ఓ అమ్మాయిని చూశాను. తన పేరు మణికర్ణిక’ అని చెప్తున్నప్పుడు కంగన పులిని వేటాడుతున్న సన్నివేశం ఆకట్టుకుంటోంది.కత్తిసాము చేస్తున్న సమయంలో కంగన ముగ్గురు వ్యక్తులపై నుంచి దూకి ఏనుగుపై కూర్చున్న సన్నివేశం హైలైట్‌గా  నిలుస్తుంది.

Related image

ఝాన్సీ ప్రాంతానికి మహారాణిగా మణికర్ణికను ప్రకటిస్తున్నప్పుడు..‘లక్ష్మీబాయి అనే నేను.. నా శరీరంలో రక్తం ప్రవహిస్తున్నంత వరకు ఝాన్సీని కాపాడతానని మాటిస్తున్నాను’ అని చెప్పడం . ఆ తర్వాత మణికర్ణిక తన భర్త, బిడ్డను కోల్పోవడం, ఝాన్సీ ప్రాంతాన్ని కాపాడుకోవడం కోసం బ్రిటిషర్లను చీల్చిచెండాడం వంటివి ఆసక్తికరంగా చూపించారు.ఇప్పటికే పలు సార్లు తన నటన తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్న ‘కంగనా రనౌత్’ ఈ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో మరింత పేరు తెచ్చుకునే అవకాశం ఉంది.

భారీ సాంకేతిక నైపుణ్యం గల టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేయడం వల్ల ఈ సినిమా అన్ని విభాగాల్లోనూ చాలా అభ్బుతంగా తీయడం జరిగింది.అయితే ఈ సినిమా చాలా వరకు దర్శకత్వం చేసి క్రిష్ ఆ తరువాత కొన్ని కారణాల వల్ల  సినిమాలోని పలు సన్నివేశాలకు కంగననే దర్శకత్వం వహించారు. ఇందులో లక్ష్మీబాయికి సన్నిహితురాలైన ఝల్కరీ బాయి పాత్రలో బుల్లితెర నటి అంకితా లోఖాండే నటించారు. జనవరి 25న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.