అరవింద సమేత ….కత్తి మహేష్ రివ్యూ

kathi mahesh review on aravinda sametha, kathi mahesh , trendingandhra

ఎన్టీఆర్ హీరోగా, పూజాహెగ్డే హీరోయిన్ గా రూపొందిన తాజా చిత్రం అరవిందసమేత . దసరా కానుకగా నేడే అభిమానుల ముందుకు వచ్చింది.ఈ చిత్రం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కింది.ఈ సినిమాలో ఎన్టీఆర్ తన ప్రాణాన్నిపెట్టి నటించాడని తెలుస్తుంది.ఇప్పటికే US లో ప్రీమియర్ షో లు పూర్తిఅవ్వగా సూపర్ హిట్ టాక్ వచ్చింది. దీనితో అభిమానుల సంబరాల్లో మునిగిపోయారు.రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పటికే షోలు పడ్డాయి.

 

ఇక ఈ చిత్రంపై తెలుగు ప్రఖ్యాత సినీ క్రిటిక్ కత్తిమహేష్ తన రివ్యూని ఇచ్చాడు . ముందుగా ఈ చిత్రం చాలాబాగుంది అని చెప్పాడు. ఈ సినిమా మొత్తం వన్ మ్యాన్ షో అని చెప్పాడు. ఎమోషనల్ సీన్స్ లో ఎన్టీఆర్ మరోసారి జీవించేసాడు అని, ఎన్టీఆర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఫ్యాక్షన్ నేపథ్యం లో చాల సినిమాలు వచ్చాయి కానీ ఇంటువంటి కథ తో రాలేదు అని చెప్పాడు.

 

ఇక పొతే ఈ సినిమాకి మరో పెద్ద ప్లస్ పాయింట్ జగపతిబాబు అని, ఓబులేసు పాత్ర లో జగ్గు జీవించేసాడు అని, జగ్గు ని చుస్తే ఎలాంటివాడికైనా కూడా గుండెల్లో వణుకు వస్తుందని చెప్పాడు. అలాగే త్రివిక్రమ్ తన మాటలతో తో మరోసారి మాయచేయసాడని చెప్పాడు. థమన్ మ్యూజిక్ సినిమాకి మరో ఊపిరి అని,ఈ సినిమాకి ప్రాణంపెట్టి మ్యూజిక్ ఇచ్చాడు అని చెప్పాడు. మొత్తం మీద బొమ్మ సూపర్ హిట్ అని కత్తిమహేష్ తేల్చేసాడు.