త్వరలో హీరోగా కౌశల్ ఎంట్రీ ….డైరెక్టర్ ఎవరో తెలుసా …!

kaushal tollywood entry , trendingandhra

బిగ్ బాస్ 2‘ హౌస్ లో మొదటి నుంచి కూడా తన ప్రత్యేకతను చాటుకుంటూ వచ్చిన కౌశల్, ఎంతోమంది అభిమానుల మనసులను దోచుకుని, చివరికి టైటిల్ ను గెలుచుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన చాలా ఉత్సాహంగా మాట్లాడాడు. “నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది అక్కడ గట్టి పోటీని ఎదుర్కొన్నది మీ అభిమానాన్ని సంపాదించుకోవడం కోసమే. ఇప్పుడు చెప్పండి మీ కోసం నేనేం చేయాలో” అన్నాడు.

kaushal , tollywood, trendingandhra

దాంతో ఫ్యాన్స్ అంతా కూడా ‘సినిమాల్లో హీరో కావాలంటూ’నినాదాలు చేశారు. అందుకు కౌశల్ స్పందిస్తూ .. “అయితే తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తాను. ఇక నుంచి దర్శకుల కోసం వెయిట్ చేస్తుంటాను. నేను హీరోగా సినిమా చేస్తానంటూ ఏ దర్శకుడైనా వస్తే .. నా తడాఖా చూపిస్తాను. ఇంతకాలానికి ‘బిగ్ బాస్ 2’ ద్వారా నాకు బిగ్ బ్రేక్ వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, మీ ముచ్చట తీరుస్తాను. మీ అందరి సహకారంతోనే జీవితంలో ఒక్కో అడుగు ముందుకు వెళతాను” అని ఆయన చెప్పుకొచ్చాడు.

kaushal , tollywood , trendingandhra

Also Read : బిగ్ బాస్ విన్నర్ కౌశల్ పై కోన వెంకట్ సంచలన వ్యాఖ్యలు

ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోల మధ్య పోరు చాలా పిక్ లో ఉంది . ఒక్క సినిమా సరైనది పడితే స్టార్ స్టేటస్ ని అందుకోవడం చాలా సులభం అని మన యూత్ ఐకాన్ విజయదేవరకొండ నిరూపించాడు . విజయ్ నటించిన వరుస సినిమాలు హిట్ అవ్వడం తో ప్రస్తుతం స్టార్ స్టేటస్ వైపు పరుగులు పెడుతున్నాడు . నాలుగు సినిమాలు చేస్తే వచ్చిన క్రేజ్ ,కౌశల్ కి ఒక్క బిగ్ బాస్ లో తన ఫోర్ఫామెన్స్ తో తెచ్చుకున్నాడు . ప్రస్తుతం కౌశల్ కోసం టాలీవుడ్ లో చాలా కథలు సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది ,కౌశల్ కి ఉన్నక్రేజ్ ని కాష్ చేసుకోవడానికి నిర్మాతలు కూడా ఉత్సహం చూపిస్తున్నారు . కౌశల్ తో సినిమా చేయడానికి ఒక స్టార్ డైరెక్టర్ కథని సిద్ధం చేస్తునట్టు తెలుస్తుంది . ఒక్క సినిమా పడితే కౌశల్ ని పట్టుకోవడం చాలా కష్టం కావచ్చు .