దేశంలోనే తెరాసను తిరుగులేని శక్తిగా మారుస్తా …. కేటీఆర్

KTR Change to TRS party in power of the Country, Trendingandhraతెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసి …. నూతన రాజకీయ 
బాధ్యతలు చేపట్టేముందు కేటీఆర్‌ తెలంగాణ తల్లికి  , ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బసవతారకం ఆస్పత్రి నుంచి ర్యాలీగా కేటీఆర్‌ తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఈ వేడుకలో తెరాస  అభిమానులు, కార్యకర్తలు, మహిళలు భారీ ఎత్తున పాలుపంచుకున్నారు… అంత జన సమూహం మధ్యలో  కేటీఆర్ గారు తెలంగాణ భవన్ కి రావడం. జెండాలు, పార్టీ నాయకుల చిత్రపటాల ప్రదర్శనతో ఆ తెలంగాణ భవన్‌ ప్రాంతమంతా గులాబీ మయంగా మారిపోయింది. డప్పు చప్పుళ్ల మోత, పోతు రాజుల విన్యాసం, బాణసంచా కాల్పులు మధ్య తెలంగాణ భవన్‌ పరిసరాలు పండుగ వాతావరణం సంతరించుకుంది.

Related image

ఈ సందర్భంగా కేటీఆర్ గారు మాట్లాడుతూ వందేళ్లపాటు తెలంగాణ రాష్ట్ర సమితిని రాష్ట్ర ప్రజల సేవలో నిమగ్నమయ్యేలా మార్పులు చేస్తానని పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు గా తనకు ఇచ్చిన ఈ అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నానని. . అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. సంస్థాగతంగా పటిష్ఠంగా పార్టీ నిర్మాణం చేసి, ఎక్కడికక్కడ పార్టీ కార్యాలయాలతో పాటు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని కేటీఆర్‌ చెప్పారు. ‘‘తెరాసను భవిష్యత్తులో తిరుగు లేని రాజకీయ శక్తిగా మార్చేందుకు కేసీఆర్‌ ముఖ్యమైన బాధ్యతను నాకు అప్పగించారు. పేదలు, రైతులకు పార్టీ అంకితమయ్యేందుకు సంక్షేమ పథకాలను అమలు చేస్తాం. మీలో ఒకడిగా, సోదరుడిగా అన్ని రంగాల వారికీ అండగా ఉంటా. పార్టీని ఒక తిరుగులేని శక్తిగా మారుస్తా. కేసీఆర్‌ నాపై పెట్టిన బాధ్యతను సవ్యంగా నిర్వర్తిస్తా. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పార్టీ ఉండేలా దేవుడు నాకిచ్చిన శక్తిని మొత్తం ఇందుకు వినియోగిస్తా’’ అని వ్యాఖ్యానించడం జరిగింది.