కార్య నిర్వాహక అధ్యక్షునిగా కేటీఆర్ పదవి నేడే స్వీకరణ

KTR's post as executive chairman, Trendingandhra

టీఆర్ఎస్ పార్టీ రెండో సారి కూడా అధికారంలోకి రావడంతో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యాక రానున్న రోజుల్లో దేశ రాజకీయాల్లో కూడా అడుగులు వేస్తున్న ఈ తరుణంలో పని భారం తగ్గించుకునే ప్రయత్నంగా..తెలంగాణ రాష్ట్రసమితి కార్య నిర్వాహక అధ్యక్షునిగా సోమవారం కేటీఆర్‌ గారు అధికారికంగా బాధ్యతలు చేపట్టనున్నారు. భారీ ఎత్తున పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, నాయకుల నడుమ తెలంగాణ భవన్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు తెరాస సన్నాహాలు చేస్తోంది.కేటీఆర్‌ ఉదయమే సీఎం కేసీఆర్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకొని అక్కడి నుంచి 11.30కి తెలంగాణ భవన్‌కు వస్తారు. తెలంగాణ తల్లికి, ఆచార్య జయశంకర్‌ విగ్రహానికి పూలమాలలు వేస్తారు. కార్యనిర్వాహక అధ్యక్షునిగా ఉదయం 11.56కి బాధ్యతలు చేపడతారు. తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.