సునీల్ టైం అయిపోయింది.. ఇక పొడిచేదేమి లేదు

Latest News in Sunil is out of time.. Trendingandhra

సునీల్ ఒక్కప్పుడు స్టార్ కమెడియన్ ఇప్పుడు ఇంకా పొడిచేదేమి లేదు అని 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వి సెన్సషనల్ కామెంట్స్ చేసారు. పృథ్వి నటించిన తాజా చిత్ర బ్లఫ్ మాస్టర్. ఈ చిత్రంపై పృథ్వీ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రంతో తాను మరింత బిజీ అవుతానని ఈ చిత్రంతో తనకు కొత్త ఇమేజ్ వస్తుందని ఆశిస్తున్నాడు. బ్లఫ్ మాస్టర్ విడుదల సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలపై స్పందించాడు. ఆ సమయంలోనే సునీల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లో సునీల్ కి సూపర్ క్రేజ్ ఉండేది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరి టైం నడుస్తుంది.

Image result for Sunil photos

బ్రహ్మానందం గారు , ఆ తరువాత సునీల్ , ఇప్పుడు నాతో పాటు చాలా మంది కమెడియన్స్ కి మంచి అవకాశాలు వస్తున్నాయి. కమెడియన్ ఒకసారి హీరోగా మారి మల్లి కామెడీ వైపు వచ్చిన సక్సెస్ అవ్వరు. సునీల్ హీరోగా మారి ఏడూ సంవత్సరాలు అయ్యింది. ఇంకా హిట్ కోసం ఇబ్బందిపడుతున్నాడు. అందువల్ల మళ్ళీ కమెడియన్ గా మారుతున్నప్పుడు ఇంకేం ఉంది… సునీల్ కం బ్యాక్ అంటూ తెగ హడావుడి చేసేసారు. ఇక పొడిచేస్తాడు, తేరుగులేదు అన్నారు ఇప్పుడు ఏమైంది… కమెడియన్ గా కూడా సునీల్ ని ప్రేక్షకులు ఆదరించే పరిస్థితిలో లేరు. సునీల్ ఆదరణ పొందలేకపోతున్నాడు అంటూ పృథ్వి వాపోయారు.