నందమూరి , కొణిదల అభిమానులు కొట్టుకుచస్తున్నారు

Nandamuri and Konidela fans are getting fighte, Trending Andhraతాజాగా ఒక ఇంటర్వ్యూ లో బాలకృష్ణ ఎవరో నాకు తెలీదు అని నాగబాబు అనగా అది వైరల్ గా మరీనా సంగతి తెలిసిందే. దాంతో బాలయ్య అభిమానులు ఆగ్రహానికి గురై నాగబాబు తనయుడి సినిమా అంతరిక్షాన్ని విడుదుల కానివ్వం అంటూ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దీని పై ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ నా ఆలోచన కార్యక్రమంలో స్పందించారు. నందమూరి, కొణిదెల కుటుంబాల మధ్య చాలాకాలంగా మంచి స్నేహం ఉంది, నాగబాబు సరదాగా ఈ వ్యాఖ్యలు చేసి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు. స్వర్గీయ ఎన్టీఆర్ బయోపిక్ లో ఎస్వీ రంగారావుగా నాగబాబు నటించినట్లు వార్తలు వచ్చాయనీ, అలాంటిది వారిద్దరి మధ్య విభేదాలు ఎలా ఉంటాయని ప్రశ్నించారు.

Related image

ఇద్దరు నటుల మధ్య వివాదంపై ‘నా ఆలోచన’ పేరుతో ఓ వీడియోను విడుదల చేశారు. బాలకృష్ణ కుటుంబానికి చిరంజీవి కుటుంబం చాలా క్లోజ్ అని భరద్వాజ చెప్పారు. బాలయ్య కూతురి పెళ్లికి చిరంజీవి కుటుంబీకులంతా వెళ్లారనీ, వేడుకల్లో డ్యాన్స్ చేసి అలరించారని గుర్తుచేశారు. నటులు అన్నాక వాళ్లంతా బాగానే ఉన్నారనీ, కానీ అభిమానులు ఎందుకు కొట్టుకుని చస్తున్నారని ప్రశ్నించారు. సోషల్ మీడియాలో నందమూరి, కొణిదెల అభిమానులు బండబూతులు తిట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభిమానం అన్నది సినిమా చూసేవరకే ఉండాలనీ, కానీ ఇప్పుడు మాత్రం దూషణలు హద్దులు దాటాయని వ్యాఖ్యానించారు. చాలామంది అభిమానులు చేస్తున్న కామెంట్లు అనాగరికంగా ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.