కొత్త సీఎంగా కేటీఆర్.. కేసీఆర్ సంచలన నిర్ణయం

 New CEAT KTR.. KCR is a sensational decision, Trendingandhraతెలంగాణ ఉద్యమనాయకుడిగా ప్రజల హృదయాల్లో చెరగని స్థానం సంపాదించుకున్న నేత కేసీఆర్. ప్రజల్లో ఆయనపై ఉన్న అభిమానం కొన్నిరోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఓట్లరూపంలో వెల్లువెత్తింది. దాని ఫలితమే ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ కు తిరుగులేని మెజారిటీ వచ్చింది. కేసీఆర్ ప్లానింగ్ ముందు ఇతర పార్టీలన్నీ నామరూపాల్లేకుండా తుడిచిపెట్టుకుపోయాయి. కేటీఆర్, హరీష్ రావు వంటి దిగ్గజాలే కాదు బాల్క సుమన్ వంటి విద్యార్థినాయకులు సైతం ఎన్నికల్లో భారీ మెజారిటీ సొంతం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పవనాలు వీస్తున్నా తెలంగాణలో మాత్రం కారుదే పైచేయి అయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ వరుసగా రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. ఆశ్చర్యకరంగా ఆయన తన కుమారుడు కేటీఆర్ ను టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించారు. అంతేకాదు, అప్పటికప్పుడు కేటీఆర్ కు బాధ్యతలు కూడా అప్పగించారు. ఓ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీ మొత్తం అతడి చెప్పుచేతల్లోనే ఉంటుంది. ఇప్పటివరకు ఈ అధికారం కేసీఆర్ వద్ద ఉండేది. కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక చాలా తతంగం నడించిందని చెబుతున్నారు. వచ్చే వేసవిలో జరిగే సార్వత్రిక ఎన్నికల తర్వాత కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. తాను ఎంపీగా పోటీ చేసి కేంద్రంలో తన పవరేంటో చూపించాలని కేసీఆర్ పట్టుదలగా ఉన్నారట.

Image result for ktr

అందుకే ఇప్పుడు కేటీఆర్ ను పార్టీ అధ్యక్షుడిగా చేసి ఆపై సీఎం పదవి కూడా అప్పగించాలన్నది కేసీఆర్ నిర్ణయంగా కనిపిస్తోంది. ఎక్కడైనా పార్టీ చీఫ్ గా ఉన్నవారే ముఖ్యమంత్రి కూడా అవుతారు. ఆ లెక్కన చూస్తే కేటీఆర్ సీఎం అవడమే తరువాయి అని భావించాలి. కేటీఆర్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కొత్త కానీ, ఆయన ఎప్పటినుంచో తన తండ్రి తరపున పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నారు. టీఆర్ఎస్ పై ఆయన ఎప్పుడో పట్టు సాధించారు. ఉప ఎన్నికల్లోనూ, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం కేటీఆర్ కార్యదక్షతకు నిదర్శనం. కొంతకాలం నుంచి కేసీఆర్ కేంద్ర రాజకీయాలపై ఆసక్తిచూపిస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్ కాకుండా ఇతర ప్రాంతీయ పార్టీలను కలుపుకుని కొత్త ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంలో చక్రం తిప్పాలన్నది కేసీఆర్ ఆలోచన. ఈ క్రమంలోనే తనపై బాధ్యతలు తగ్గించుకునే పనిలో భాగంగానే కుమారుడు కేటీఆర్ కు పార్టీ పగ్గాలు అప్పగించారు. మరికొన్ని నెలల్లోనే సీఎం బాధ్యతలు కూడా బదిలీ చేస్తారని రాజకీయ మేధావులు అంచనావేస్తున్నారు. పూర్తిస్థాయిలో పార్టీ పగ్గాలు అప్పగించినందున కేటీఆర్ ను ఈసారి మంత్రివర్గంలోకి తీసుకోకపోవచ్చని, కేటీఆర్ కూడా ఫుల్ టైమ్ పార్టీ పనులు, పార్లమెంటు ఎన్నికలపైనే దృష్టిపెడతారని తెలుస్తోంది.