శృంగారానికి, లావుకు సంబంధం లేదు..!

nithya menen sensational comments on beauty , trendingandhra

ఆ హారోయిన్‌కు పొగ‌రు అని కొంద‌రు అంటారు. కాదు.. కాదు.. ఆత్మ విశ్వాస‌మ‌ని మరికొంద‌రు అంటారు. ఎవ‌రేమ‌నుకున్నా.. త‌న దారి త‌నదే అనే రీతిలో ముందుకు సాగిపోతుంటుంది ఆ హీరోయిన్‌. అంతేకాకుండా, సినిమాల విష‌యంలో రాశిక‌న‌నా.. వాసి ముఖ్య‌మంటుంది. అందుకే, ఆమె సినిమాలు అప్పుడ‌ప్పుడు ద‌ర్శ‌న‌మిస్తుంటాయి.

Nithya-Menon , trendingandhra

ఇప్ప‌టికే, ఆమె ఎవ‌రో అర్థ‌మైపోయి ఉంటుంది. ఆమెనే, హీరోయిన్ నిత్యా మీన‌న్‌. పొట్టివాళ్లు గ‌ట్టివాళ్లంటారు. ఈ ఉప‌మానం నిత్యా మీన‌న్‌కు స‌రిగ్గా స‌రిపోతుంది. త‌న విష‌యంలో ఎవ‌రేమనుకున్నా.. త‌న‌దారి త‌న‌దేన‌న‌ని అంటున్న నిత్యామీన‌న‌ను సినిమా.. సినిమాకు గ్యాప్ ఎక్కువ తీసుకోవ‌డానికి కార‌ణం ఏమిట‌ని అడిగితే, నావ‌ర‌కు వస్తే సినిమాలు ఒక్క‌టే కాదు.. నా ప్రాధాన్యాలు వేరే ఉన్నాయి.

nithya menen , trendingandhra

సినిమాలు ఒక్క‌టే అని చూసుకుంటే.. వాటిని మిస్స‌వుతాన‌ని అనిపించింది. అందుకే, సినిమాల‌ను త‌గ్గించుకున్నాను. చాలా ప్ర‌త్యేకం అనిపిస్తేనే చేస్తున్నాను అని స‌మాధానం ఇచ్చింది. ఇటీవ‌ల కాలంలో మీ బ‌రువు మీద వ‌స్తున్న కామెంట్ల‌కు మీ స‌మాధానం ఏంటి అని ప్ర‌శ్నిస్తే.. నేను వాటికి స‌మాధానం ఇచ్చినా.. ఇవ్వ‌క‌పోయినా కామెంట్లు చేసే వారు చేస్తూనే ఉంటారు.

nithya menen , trendingandhra

బ‌రువు గురించి.. నేను మొద‌ట్నుంచి కూడా ప‌ట్టించుకోను. నా బ‌రువుతో నాకు ఎలాంటి స‌మ‌స్య లేన‌ప్పుడు ఇత‌రుల‌కు ఎందుకు స‌మ‌స్య‌. అయినా త‌గ్గాల‌నుకుంటే ఓ నెల రోజుల్లో నేను బ‌రువు త‌గ్గ‌గ‌ల‌ను. ఆ న‌మ్మ‌కం నాకుంది. పాత‌త‌రం హీరోయిన్లంద‌రూ లావుగా ఉండేవారు. అయినా వారు శృంగార పాత్ర‌ల్లో చేసేవారు. వారు అంత పేరు తెచ్చుకోవ‌డానికి కారణం.. వారు చేసిన సినిమాలేన‌ని మీడియా మీద విరుచుకుప‌డింది నిత్యా మీన‌న్‌.