“ప్రభాస్- అనుష్క”  డేటింగ్ పై… కరణ్ జోహార్ కి ఎందుకంత డౌట్…?

"Prabhas-Anushka" on dating... Why Karan Johar's Doubt? Trendingandhra
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు- నిర్మాత- నటుడు
కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరించుతున్న
బాలీవుడ్ టీవీ షో “కాఫీ విత్ కరణ్” అనే ప్రోగ్రామ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలుసు…అయితే   ఈ కార్యక్రమానికి ‘బాహుబలి’ దర్శకుడు ఎస్‌.ఎస్‌ రాజమౌళి, ప్రభాస్‌, రానా దగ్గుబాటి హాజరైన సంగతి తెలిసిందే.టాలీవుడ్‌ అగ్రనటులు ప్రభాస్‌, అనుష్కలు ప్రేమలో ఉన్నట్లు ఎప్పటినుంచో వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయం గురించి ప్రభాస్‌, అనుష్క ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చినప్పటికీ ఇంకా పుకార్లు షికార్లు చేస్తన్నాయి వీటికి ఏ మాత్రం తెరపడటంలేదు. దీని గురించి తెలుసుకోవాలని  కరణ్‌ జోహార్‌కు కూడా అనిపించినట్లుంది. అందుకే..
 
 ఈ కార్యక్రమంలో సందర్భంగా కరణ్‌.. ప్రభాస్‌ను అనుష్క గురించి అడిగారు. ‘‘నువ్వు ‘దేవసేన’ అనుష్కతో డేటింగ్‌లో ఉన్నావని వస్తున్న గుసగుసలు నిజమా? కాదా?’’ అని అడిగారు. ఇందుకు ప్రభాస్‌..‘లేదు’ అన్నారు. ‘కానీ గుసగుసలు వినిపిస్తున్నాయి కదా..’ అని కరణ్‌ అడగ్గా.. ‘ఈ గుసగుసలను మొదలెట్టింది మీరే..’ అని ఫన్నీగా అన్నాడు. దాంతో కరణ్‌తో పాటు పక్కనే ఉన్న రాజమౌళి, రానా పగలబడి నవ్వుకున్నారు. ఆ తర్వాత కరణ్‌ ప్రభాస్‌ను మరో ప్రశ్న అడిగారు. ‘నాకు అబద్ధాలు చెప్పావు కదూ..’ అని అడగ్గా.. ‘అవును’ అని చెబుతూ ప్రభాస్‌ అక్కడున్న గ్లాస్‌లోని డ్రింక్‌ తాగడం  మరింత ఫన్నీగా ఉంది.
 
‘బాహుబలి: ది బిగినింగ్‌’, ‘బాహుబలి: ది కన్‌క్లూజన్‌’ చిత్రాలు హిందీలోనూ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీ హిందీ వెర్షన్‌కు ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌  జోహార్ నిర్మాతగా హిందీలో వ్యవహరించారు. ఈ సినిమా ద్వారా కరణ్‌, రానా, రాజమౌళి, ప్రభాస్‌ మంచి స్నేహితులుగా వారి మధ్య మంచి అనుబంధం ఉంది. అందులో భాగంగా కరణ్ జోహార్ ఈ కార్యక్రమం ద్వారా వారితో కలిసి నవ్వుల పూవులు పూయించారు.