ఆ న‌లుగురిని ఎమ్మెల్సీ ప‌ద‌వుల నుంచి తొల‌గించండి..!

Remove the four from the MLC posts..! Trendingandhra
తెలంగాణ రాష్ట్ర స‌మితి నేత‌లుగా ఉంటూ, త‌మ పార్టీ కారు గుర్తుపై ఎమ్మెల్సీలుగా గెలుపొంది ఆ త‌రువాత వారి స్వ‌లాభం కోసం ఇత‌ర పార్టీల్లో చేరారు. అలా ఇత‌ర పార్టీల్లో  చేరిన వారిపై అన‌ర్హ‌త వేటు వేయాల‌ని కోరుతూ తెరాస చీఫ్ విప్ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డితోపాటు ఎమ్మెల్సీ పాతూరి సుధాక‌రెడ్డిలు విజ్ఞ‌ప్తి చేశారు. ఈ మేర‌కు సోమ‌వారం వారు శాస‌న మండలి చైర్మ‌న్  స్వామిగౌడ్‌ను క‌లిసి ఫిర్యాదు చేశారు.
 
శాస‌న మండ‌లి స్వామిగౌడ్‌ను క‌లిసిన అనంత‌రం వారు మీడియాతో మాట్లాడుతూ కారు గుర్తుపై ఎమ్మెల్సీలుగా గెలుపొందిన భూప‌తిరెడ్డి, యాద‌వ‌రెడ్డి, రాములు నాయ‌క్‌, కొండా ముర‌ళిపై ప్ర‌స్తుతం ఇత‌ర పార్టీల్లో కొన‌సాగుతున్నార‌ని, త‌మ పార్టీ త‌రుపున ఎన్న‌కైనందున వారిని ప‌ద‌వుల నుంచి తొల‌గిస్తూ అన‌ర్హ‌త వేటు వేయాల‌ని స్వామిగౌడ్‌ను కోరిన‌ట్టు తెలిపారు.
 
కాగా, పార్టీ మారే స‌మ‌యంలో ఆ న‌లుగురు తెరాస‌పై చేసిన విమ‌ర్శ‌ల‌ను ఆధారంగా వారిని ఎమ్మెల్సీ ప‌దువుల నుంచి తొల‌గించాల‌ని స్వామిగౌడ్‌కు ఫిర్యాదు చేసిన‌ట్టు చెప్పారు. అయితే, ప‌ల్లా రాజేశ్వ‌ర్‌రెడ్డి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీల్లో ఇద్ద‌రు గ‌వ‌ర్న‌ర్ కోటాలోను, మ‌రో ఇద్ద‌రు స్థానిక సంస్థ‌ల కోటాలోనూ గెలుపొందిన విష‌యం తెలిసిందే.