సైంటిస్ట్ లూయిస్ పాశ్చర్ అద్భుత పరిశోధనలు

louis pasteur mini biography, Trendingandhra

లూయిస్ పాశ్చర్ 1822 సంవత్సరం డిసెంబరు 27న ఫ్రాన్స్ లోని డోల్ గ్రామంలో జన్మించాడు. నెపోలియన్ సైన్యంలో పనిచేసిన తండ్రి జీన్ పాశ్చర్ తోలు వ్యాపారం చేసి జీవించేవారు. పాశ్చర్ పాఠశాలకు వెళ్ళకుండా కొంతవరకు విద్యావంతుడయ్యాడు. లూయిస్ గొప్ప చిత్రకారుడు కూడా. చిత్రలేఖనంలో మంచి ప్రతిభ కనపరిచేవాడు. తల్లిదండ్రులతో పాటు ఇరుగుపొరుగు వారివి, స్నేహితులవి బొమ్మలు పెయింట్ చేశాడు. చాలా చిత్రాలు ఇప్పటికీ పాశ్చర్ మ్యూజియంలో భద్రపరచబడ్డాయి. గణితం, భౌతిక, రసాయనిక శాస్త్రాలంటే ఇష్టమున్న పాశ్చర్ ఉపాధ్యాయ జీవితాన్ని గడపాలనుకొనేవాడు. పదహారేళ్ల వయసులో కాలేజీ చదువు కోసం పారిస్ లో అడుగుపెట్టాడు. డాక్టరేట్ పూర్తిచేసి 1848లో స్ట్రాస్ బర్గ్ విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా నియమితులయ్యారు. యూనివర్సిటీ వైస్ ప్రిన్సిపల్ కు వారి అమ్మాయి మేరీ లారెంట్ ను పెళ్ళిచేసుకుంటానని అనుమతికోసం లేఖ రాశాడు. 1849 మే 29న వీరిద్దరు పెళ్ళిచేసుకున్నారు. ఆదర్శదంపతుల్లాగా జీవించారు. వీరికి అయిదుగురు పిల్లలు పుట్టినా ముగ్గురు మరణించారు; టైఫాయిడ్ వల్ల ఇద్దరు, మశూచి వల్ల ఒకరు పిల్లల్ని పోగొట్టుకొన్నాడు.

Related image

పాశ్చర్ అంగారక పదార్ధాలు ధ్రువిత కాంతిని ఏ విధంగా విచలనం చెందిస్తాయో అధ్యయనం చేసి “స్టీరియో కెమిస్ట్రీ” అనే కొత్త రసాయన శాస్త్రాన్ని రూపొందించారు. ఆహార పదార్ధాల్లో సంభవించే సూక్ష్మజీవుల పరిశోధనలు చెప్పట్టాడు లూయిస్. లూయిస్ ని ఫాదర్ అఫ్ ది మైక్రో బయాలజీ అంటారు. రేబిస్ వ్యాధి (కుక్క కాటు )కు మొదట డ్రగ్ కనిపెట్టింది ఈయనే. అనేక వ్యాధులకు కారణాలు తెలుసుకుని రోగ నివారణకు మొట్ట మొదట బాటలు వేశారు లూయిస్. అప్పట్లో టీకాలను ఆవిష్కరించింది కూడా ఈయనే. రేబిస్ వ్యాధి తగ్గించే క్రమంలో ఈయన టీకా ను కనిపెట్టాడు. మనం తాగే పాల ద్వారా వ్యాపించే రోగాలను అరికట్టే పద్దతిని కనిపెట్టారు. దానినే ఇప్పుడు పాశ్చరియాజేషన్ అంటారు. ఫూలియాడ్ వాటి అంశాల ఫై ప్రరిశోధనలు చేసి అనాధులుగా ఉన్న భావాలను కండించి సూక్ష్మజీవుల పై కొత్త సిద్ధాంతాలను రూపొందించాడు. లూయిస్ తన పూర్తి జీవితానికి శాస్త్ర పరిశోధనలకు అంకితం చేసారు. రెండు సార్లు గుండె పోటు , పక్షవాతం వచ్చిన నిరంతర శ్రమ , కఠోర దీక్ష తో పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. సూక్ష్మజీవ శాస్త్రంలో అత్యుత్తమ గౌరంగా భావించే లీజువెన్హాయక్ బహుమతిని 1895 లో లూయిస్ కి పురస్కరించారు. లూయిస్ 1895 సెప్టెంబర్ 28 న ఈ గొప్ప పరిశోధన వేత్త ఈ లోకాన్ని విడిచారు.