ఇండోనేషియా విమానం కూలే కొద్ది క్షణాల ముందు ఏమైందో చూడండి…!

indonesian,plane crash,indonesian plane crashes,latest plane crashes,trendingandhra

ఇవాళ ఉదయం సముద్రంలో కూలిపోయినట్టు భావిస్తున్న ఇండోనేషియా విమానం, ప్రమాదానికి సరిగ్గా కొద్ది క్షణాల ముందు వెనక్కి తిరిగి వచ్చేందుకు అనుమతి కోరినట్టు సమాచారం. ఆ తర్వాత కొద్ది సేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం…. 188 మంది ప్రయాణికులు గల్లంతవ్వడం జరిగిపోయాయి. ది లయన్ ఎయిర్‌కి చెందిన జేటీ610 విమానం రాజధాని జకర్తా నుంచి స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 6:20కు బయల్దేరింది. అనంతరం 6:33కి అంటే సరిగ్గా 13 నిమిషాలకు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్‌తో సంబంధాలు తెగిపోయాయి.

కాగా సంబంధాలు తెగిపోయే కొద్ది నిమిషాల ముందే తిరిగి వచ్చేందుకు అనుమతి కోరినట్టు ఎయిర్ నేవిగేషన్‌ ఒకరు పేర్కొన్నారు. అంతలోనే విమానం ఆచూకీ లేకుండా పోయిందన్నారు. కాగా ప్రమాద సమయంలో మొత్తం 178 ప్రయాణికులు, ఓ చిన్నారి, ఇద్దరు పసికందులు, ఇద్దరు పైలట్లు, ఐదుగురు సిబ్బంది ఉన్నట్టు ఇండోనేషియా పౌర విమానాయాన శాఖ డైరెక్టర్ జనరల్ సిందు రహయు వెల్లడించారు.

సుమత్రా దీవుల్లోని పంకాల్ పినాగ్ బయల్దేరిన ఈ విమానంలో మొత్తం 23 మంది ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నట్టు చెబుతున్నారు. జావా సముద్రంలో ప్రయాణికుల వస్తువులు, విమాన శకలాలు కనిపించినట్టు ఇండోనేషియా విపత్తు సహాయక అధికారి ఒకరు ట్వీట్ చేశారు. దీంతో పశ్చిమ జావా తీరంలో విమానం కూలిందన్న అనుమానాలు బలపడుతున్నాయి. విమాన శకలాలను గుర్తించేందుకు జకర్తా పోర్టు నుంచి ఓ టగ్ బోట్ బయలుదేరి వెళ్లింది.