నానికి జోడిగా అరుగు హీరోయిన్స్

Six heroines together for Nani, Trending Andhra
 
అక్కినేని నాగార్జున‌తో క‌లిసి న‌టించిన దేవ‌దాస్ వంటి మ‌ల్లీస్టార‌ర్ చిత్రం డిజాస్ట‌ర్ కావ‌డంతో త‌న త‌దుప‌రి చిత్రాల‌పై దృష్టిపెట్టాడు నేచుర‌ల్ స్టార్ నాని. అయితే, ఇప్ప‌టికే క్రికెట్ నేప‌థ్యంలో సాగే క‌థ‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌మే కాకుండా, షూటింగ్‌ను శ‌ర‌వేగంగా పూర్తి చేసే ప‌నిలో ఉన్నాడు నాని. అలాగే, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కే కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నేచుర‌ల్ స్టార్ నాని న‌టించ‌నున్నాడంటూ సోష‌ల్ మీడియాలో ప‌లు క‌థ‌నాలు ప్ర‌చురిత‌మ‌వుతున్న‌ సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే అఫిషియ‌ల్ స్టేట్‌మెంట్ వ‌చ్చేయ‌డంతో ఇక స్టోరీ ఏంట‌నేదానిపై సినీ జ‌నాల్లో ప‌లు ర‌కాల చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.
 
Related image
ఇక ద‌ర్శ‌కుడు విక్ర‌మ్ కె కుమార్ విష‌యానికొస్తే వైవిధ్య చిత్రాల‌ను తెరకెక్కించ‌డంలో ప్ర‌ముఖుడు. మ‌నం, 24, హాలో, వంటి విభిన్న క‌థ‌ల‌తో చిత్రాన్ని తెర‌కెక్కించి ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌లు పొందాడు. దీంతో ప్ర‌స్తుతం నానితో తెర‌కెక్కించ‌నున్న సినిమా క‌థ ఎలా ఉంటుందోన‌న్న చ‌ర్చ సినీ జ‌నాల్లో మొద‌లైంది.
 
అయితే, ప్ర‌స్తుతం సినీ జనాల చ‌ర్చ మేర‌కు నేచుర‌ల్ స్టార్ నాని కాస‌నోవా క్యారెక్ట‌ర్‌లో న‌టించ‌బోతున్నాడ‌ట‌. అందులోను నానికి జోడీగా ఆరుగురు హీరోయిన్స్ న‌టించ‌నున్నారు. ఇప్ప‌టికే అన్ని సినిమాల్లో ఒకేర‌క‌మైన పాత్ర‌లో న‌టిస్తూ వ‌స్తున్నాడ‌న్న టాక్‌ను మూట‌గ‌ట్టుకున్న నానికి కాస‌నోవా విభిన్న‌మైన చిత్రం అవుతుందంటున్నారు సినీ విశ్లేష‌కులు.