స్వల్ప లాభాతో ముగిసిన స్టాక్ మార్కెట్లు……!

stock market updates , trendingandhra
గత కొన్ని రోజులుగా నష్టాలతో సతమతమవుతున్న దేశీయ మార్కెట్లు సోమవారం
కాస్త కోలుకున్నాయి. కీలక వడ్డీరేట్ల పెంపు భయాలతో నేటి మార్కెట్‌
ఆరంభంలో సూచీలు కాస్త తడబడినా.. ఆర్థిక, ఐటీ, ఆటోమొబైల్‌, లోహ రంగ
షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చాయి. ఫలితంగా సూచీలు
నేడు లాభాలను సొంతం చేసుకున్నాయి.
 
 
stock market , TrendingAndhra
 
ఈ ఉదయం సూచీలు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లకు
పైగా నష్టంతో ట్రేడింగ్‌ను ఆరంభించగా.. నిఫ్టీ 10,900 మార్క్‌ కింద
ట్రేడ్‌ అయ్యింది. ఉదయం సెషన్‌లో సూచీలు చాలా సేపు ఒడుదొడుకుల్లోనే
సాగాయి. ఒక దశలో సెన్సెక్స్‌ దాదాపు 200 పాయింట్ల వరకు నష్టపోయింది.
అయితే మధ్యాహ్నం తర్వాత కీలక రంగాల షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు
నష్టాల నుంచి తేరుకున్నాయి.  నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ 299
పాయింట్లు లాభపడి 36,526 వద్ద, నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 11,008 వద్ద
స్థిరపడ్డాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ మాత్రం కాస్త పతనమై 72.85గా
కొనసాగుతోంది.
stock market , TrendingAndhra
 
 
ఎన్‌ఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌, హిందాల్కో, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్
లిమిటెడ్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ షేర్లు లాభపడగా.. ఎయిర్‌టెల్‌,
హిందుస్థాన్‌ పెట్రోలియం, యాక్సిస్‌ బ్యాంక్‌, ఆల్ట్రాటెక్‌ సిమెంట్‌,
ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు నష్టపోయాయి.