టీం ఇండియాకి ముగ్గురు కెప్టెన్ లు

 

Team India has three Captains Trending Andhraఅవును టీం ఇండియాకు ముగ్గురు కెప్టెన్ లు.. భారత వన్డే టీం కి ముగ్గురు కెప్టెన్ లు. టీం ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి.. కెప్టెన్ గా అవకాశం వస్తే సత్తా చాటే రోహిత్ శర్మ. ఇలా వీరు ముగ్గురు టీం ఇండియాలో ఇప్పుడు కీలకంగా మారారు. ధోని బ్యాటింగ్ చేయకపోయినా కీపింగ్ విషయంలో, స్పిన్ బౌలింగ్ విషయంలో ఇచ్చే సలహాలు జట్టు విజయానికి ఉపయోగపడుతున్నాయి.

Image result for Team India has three Captains

ఇక ఫీల్డింగ్ విషయంలో రోహిత్ శర్మ సలహాలను విరాట్ కోహ్లి పాటిస్తున్నాడు. ఎక్కడ ఫీల్డర్ ని నిలబెట్టాలి అనేది రోహిత్ శర్మ సలహాలు ఇవ్వడం వాటిని కోహ్లి పాటించడంతో మంచి ఫలితాలే వస్తున్నాయి. ఇక విరాట్ కోహ్లి ఏ బౌలర్ ని ఎప్పుడు ప్రయోగించాలి అనే విషయంలో మెళుకువలు నేర్చుకుంటూ ప్రపంచ కప్ కి జట్టుని సిద్దం చేస్తున్నాడు. ఇటీవల జరిగిన 4వ వన్డేలో టీం ఇండియా విజయం సాధించడానికి ఈ ముగ్గురు కీలక పాత్ర పోషించారు.