సిరిసిల్లలో కనిపించని పార్టీల ప్రచారం …ఎందుకంటే

campaign,congress,trs,tdp,trendingandhra

రాష్ట్రంలో కీలక నాయకుడు కేసీఆర్ తనయుడు పోటీ చేస్తున్న నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సందడి లేదు. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇక పోటీ చేస్తున్న కేటీఆర్ హైదరాబాద్ వేదికగా రాజకీయాలు చేస్తుంటే సిరిసిల్ల లో మాత్రం కేటీఆర్ కు ఓటేయ్యమని ప్రచారం చేసే వారే లేరు. ఎప్పుడు కేటీఆర్ వస్తారో అప్పుడు మాత్రమే కనిపించే నాయకులు రాజకీయాన్ని పార్ట్ టైం చేసుకున్నారు. దీంతో సిరిసిల్ల ఎన్నికల ప్రచారం లేక సైలెంట్ గా వుంది.
రాష్ట్రమంతా ముందస్తు ఎన్నికల వేడి మొదలైనా సిరిసిల్ల నియోజకవర్గంలో పార్ట్‌టైం రాజకీయాలు మాత్రమే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా సిరిసిల్ల జిల్లా కేంద్రంలో టీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ ఇతర పార్టీల నాయకులు సొంత వ్యాపారాలు ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారు. రాజకీయ నాయకుల్లో చాలా మంది వ్యాపారులు, కాంట్రాక్టర్లు, మరికొందరు కాలక్షేపం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వారే ఉన్నారు. మరికొందరు ఇబ్బందులు తలెత్తకుండా వ్యాపారాన్ని కాపాడుకోవడానికి పార్టీల్లో కొనసాగుతున్నారు. వీరంతా ఎన్నికల్లో మాత్రం సాదాసీదాగా కనిపిస్తారు. సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మళ్లీ మంత్రి కేటీఆర్‌ బరిలో నిలిచారు. కాంగ్రెస్‌, టీడీపీ కూటమి, బీజేపీల అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు.
టీఆర్‌ఎస్‌ ప్రచారం ప్రారంభించినా సిరిసిల్లలో మాత్రం ఆ సందడి కనిపించడం లేదు. మంత్రి కేటీఆర్‌ వచ్చిన సమయంలో మా త్రమే నాయకులు రంగంలోకి దిగుతున్నారు. మంత్రి ముందు హడావిడి చేసి పోతున్నారు.ఇతర రాష్ట్ర నాయకులు వచ్చిన సమయంలో కేవలం ఆ ప్రాంత నాయకులే ఉండడం విశేషం. దీంతో ప్రచారానికి అన్ని పార్టీల్లోనూ నాయకుల కంటే బయట వ్యక్తులను నమ్ముకునే పరిస్థితి తలెత్తింది. సొంత వ్యాపారాలను పెంచుకోవడం, కాంట్రాక్టర్లుగా లబ్ధిపొందడం మినహా పార్టీ అవసరాలకు సమయాన్ని వెచ్చించడానికి తొంగిచూసే వారే కరువయ్యారు. సిరిసిల్లలో మాత్రం రాజకీయ అండదండలతో సంపాదన పెంచుకోవచ్చనే ఉద్దేశంతో చాలామంది పార్టీలను అంటిపెట్టుకొని ఉంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ లో ఉంది మాత్రం అలాంటి వారే. అందుకే అక్కడ ప్రచారం అలా వుంది. ఏది ఏమైనా ప్రజలు మాత్రం ఏ పార్టీల నుండి నాయకుల గోల లేకపోవటం తో ప్రశాంతంగా ఉన్నారు.

#TheCampaignOfPartiesThatDidNotAppearInTheSiricilla …WhyBecause #Siricilla #Campaign #PoliticalNews #Kcr #Ktr