టాప్ త్రి …. తాజా వార్తలు

Top 3 Latest News, Trendingandhra1.తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న.”పెథాయ్‌ తుపాను “

ఆదివారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తోంది.పెథాయ్‌ తుపాను జిల్లాలో తీరం దాటే అవకాశముందన్న హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే ప్రభుత్వం సంరక్షణ చర్యలు చేపట్టాగా ..

పెనుతుపానుగా మారిన ‘పెథాయ్‌’ తీరానికి చేరువ అవుతుండటంతో ప్రభుత్వం అన్ని శాఖలను సమాయత్తం చేసింది. ప్రధానంగా కృష్ణా, గుంటూరు, పశ్చిమ, తూర్పుగోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ప్రమాదం పొంచి ఉంది. అక్కడి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. పరిస్థితిని సమీక్షించడానికి కంట్రోల్‌రూమ్‌లను ఏర్పాటు చేశారు. ఎస్‌డీఆర్ఎఫ్‌, ఎన్‌డీఆర్ఎఫ్‌, అగ్నిమాపక బృందాలతో పాటు విద్యుత్తు శాఖకు చెందిన 2వేల మందిని మోహరించింది. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆరుగురు జాలర్లు సముద్రంలో చిక్కుకున్నారు అది గమనించిన ప్రభుత్వం. వారిని హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న తుపాను తీరం దాటే సమయంలో గాలుల వేగం గంటకు వంద నుంచి నూటయాభై కిలోమీటర్లకు చేరడంతో పాటు.. 19 మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని  ఇప్పటికే అంచనా వేసింది.

 

2. బంగారం తెచ్చిన సింధు… ఇక ఫైనల్ ఫోబియా లేదు.

మన తెలుగు క్రీడాకారిణి పి. వి సింధు అంతర్జాతీయ స్థాయిలో భారత్ కి గుర్తింపు తెచ్చింది. ఫైనల్ ఫోబియా ను దాటుకుని ఏకంగా బంగారు పతాకాన్ని సాధించింది. ఈ సంవత్సరం మంచి ఫామ్ లో ఉన్న సింధు ఒక రకంగా ఆడిన చాలా టోర్నీల్లో చెప్పకుంటే, ఒలింపిక్స్‌లో రజతం.. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రజతం.. ఈ ఏడాది ఏకంగా ఏడు ఫైనల్స్‌లో ఓడిపోయి రజతం తెచ్చుకుంది తెలుగమ్మాయి పి.వి.సింధు. ఏ టోర్నీకి వెళ్లినా రెండో ప్లేస్ కే పరిమితం అయినప్పటికీ.  కానీ  ఈ ఏడాది చివరిలో సింధు ఫైనల్‌ అడ్డంకిని దాటి విజేతగా నిలిచింది. ప్రపంచ టూర్‌ ఫైనల్స్‌ టోర్నీలో పసిడి గెలిచి ఒక పెద్ద టోర్నీలో టైటిల్‌ గెలవలేదనే విమర్శలు తుడిచిపెట్టింది. ఆదివారం హోరాహోరీగా సాగిన ఫైనల్లో సింధు.. చిరకాల ప్రత్యర్థి ఒకుహరను ఓడించి టైటిల్‌ గెలిచింది.

3. ఓట్లకోసం రాలేదు. అండగా ఉంటా అని చెప్పడానికి వచ్చ… పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఆ పార్టీ సిద్ధాంతాలు, విది విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో భాగంగా ఆయన అమెరికా లోని తెలుగు ప్రవాస భారతీయులను కలవడం జరిగింది.అలాగే అక్కడి డాక్టర్స్ నీ కూడా కలసి భవిషత్తు కార్యాచరణ ప్రణాళిక వారితో పంచుకోవడం జరిగింది. అందులో భాగంగా జనసేన పార్టీకి నిధుల సేకరణ కోసం డాలస్‌కు రాలేదని.. ప్రవాస భారతీయులకు అండగా ఉన్నామని, వారి కోసం పోరాటం చేస్తామని చెప్పేందుకే వచ్చానని ఆ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అందుకే డాలస్‌కు రాక ముందు వాషింగ్టన్‌లో 20కి పైగా సమావేశాల్లో పాల్గొని ఇమ్మిగ్రేషన్‌ విధానంపై చర్చించానన్నారు. విదేశీ యువతే మన దేశ ఉద్యోగాలకు పోటీ పడే పరిస్థితి రావాలన్నారు. అమెరికాలోని డాలస్‌ టయోటా మ్యూజిక్‌ ఫ్యాక్టరీలో ఆదివారం జనసేన ప్రవాస గర్జన సభ,  ఈ కార్యక్రమం కోసం అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో నివసించే తెలుగువారు డాలస్‌కు తరలివచ్చారు. ఆద్యంతం ఆయన ప్రసంగం ఎంతో ఆసక్తకరంగా సాగింది.