జనసేనానితో రైలు ప్రయాణం..!

janasena,pawan kalyan,TrainJourneyWithJesanaLeaderPawanKalyan,trendingandhra

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ఈరోజు నుండి తూర్పుగోదావరి జిల్లాలో ప్రజాపోరాట యాత్ర చేపట్టనున్నారు. తొలిరోజు సాయంత్రం తుని రైల్వేస్టేషన్‌ సమీపంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. విజయవాడ నుంచి పవన్‌ కల్యాణ్‌ రైలులో తుని చేరుకుంటారు.

జనసేనానితో రైలు ప్రయాణం గ పేరుతో సాగే ఈ యాత్రలో విజయవాడలో రైల్వే పోర్టర్లు, నూజివీడులో మామిడి రైతులు, ఏలూరులో అసంఘటిత కార్మికులు, సాధారణ ప్రయాణికులు, తాడేపల్లిగూడెంలో చెరకు రైతులతో పవన్‌ మాట్లాడతారు.

రాజమహేంద్రవరంలో టెక్స్‌టైల్‌ కార్మికులు, సామర్లకోటలో విద్యార్థులు, అన్నవరంలో ఏటికొప్పాక హస్తకళల తయారీ కార్మికులతో చర్చిస్తారు. సాధారణ ప్రయాణికుడి తరహాలోనే రైలు టిక్కెట్‌ బుక్‌ చేసుకుని ప్రయాణించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 1.20 గంటల నుంచి సాయంత్రం 5.10 వరకు జన్మభూమి రైలులో జనసేనాని ప్రయాణం సాగుతుంది.

#Janasena #PawanKalyan #TrainJourneyWithJesenaLeaderPawanKalyan #PawanKalyanLatestNews