రెండో టెస్ట్ కి దూరం అయిన ఇద్దరు కీలక ఆటగాళ్ళు….!

Two key players out of the second Test, Trending Andhraఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సీరీస్ లో భాగంగా
ఇప్పటికే టీమిండియా ఒక టెస్ట్ విజయంతో మంచి ఫామ్ లో ఉంది.అని అనుకుంటూ ఉండగా ఎవరు ఊహించని విధంగా రెండో టెస్ట్ ఆరంభానికి ముందే
ఇద్దరు టీమిండియా కీలక ఆటగాళ్లు గాయపడ్డారు. శుక్రవారం పెర్త్‌ వేదికగా ఆరంభంకానున్న రెండో టెస్టు మ్యాచ్‌కు అశ్విన్‌, రోహిత్‌ శర్మలు దూరమయ్యారు. మరోవైపు గాయంతో తొలి టెస్టుకు దూరమైన ఓపెనర్‌ పృథ్వీషా ఇంకా కోలుకోలేదు.ఇలా ఒకరి తరువాత ఒకరు గాయపడడం వల్ల టీమిండియాకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పవచ్చు.దీంతో వీరి స్థానాల్లో హునుమ విహారీ, రవీంద్ర జడేజా, ఉమేశ్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌ను ఎంపిక చేయడం జరిగింది.

Related image

ఆస్ట్రేలియాలో టెస్ట్‌ సిరీస్‌  గెలిచి కోహ్లీ సేన దమ్ము చూపిస్తుంది అని అందరూ అనుకుంటూ ఉండగా.. ఇప్పటికే కోహ్లీ సేన విదేశాల్లో తమ బలాన్ని మరింత పెంచుకుంటూ దూసుకెళుతున్న సందర్భంలో..జట్టు లో కీలక ఆటగాళ్ళు లేకపోవడం ఎదురుదెబ్బే అని చెప్పాలి. అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో అశ్విన్ ఆరు వికెట్లు తీసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు పెర్త్‌ పిచ్‌ టీమిండియా కంటే ఆసీస్‌ ఆటగాళ్లకే ఎక్కువ అనుకూలంగా ఉంటుంది. దాంతో ఇద్దరు ఆటగాళ్లు దూరం కావడం జట్టు ప్రదర్శనపై ప్రభావం చూపే అవకాశం ఉంది. 

ఈ రకంగా రెండో టెస్ట్ గెలిచే అవకాశాలు అధికంగా ఆసీస్ జట్టుకే ఉన్నప్పటికీ… అంచనాలకు మించి రాణించే కోహ్లీ సేన మరి రానున్న టెస్ట్ మ్యాచ్ లో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో వేచి చూడాలి మరి. ఏకంగా సీరీస్ గెలిచి చరిత్ర సృష్టిస్తుందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.