హుజూర్ నగర్ టికెట్ రగడ .. ఆ ఎన్నారై కి ఇస్తే అంతు చూస్తామన్న శంకరమ్మ

telangana politics,telangana elections,shankaramam,huzurnagar ticket to shankaramma,trendingandhra,ts elections,telangana elections

ముందస్తు ఎన్నికల నేపధ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ నుండి ఇంకా కొన్ని స్థానాలకు టికెట్లు కేటాయించలేదు. తెలంగాణా అమరుడు అయిన శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్ నగర్ శాసనసభా నియోజకవర్గం నుండి పోటీ చెయ్యాలని టికెట్ ఆశిస్తున్నారు. ఈ నేపధ్యంలో టీఆర్ఎస్ నాయకురాలు శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకపోతే అమరవీరులకు అన్యాయం చేసినట్లవుతుందని వ్యాఖ్యానించారు.
అమరుల కుటుంబాలకు కేసీఆర్ అన్యాయం చేయరని, ఆదుకుంటారని భావిస్తున్నట్లు శంకరమ్మ తెలిపారు. తన కొడుకు కేసీఆర్ పై చూపించిన భక్తికి అయినా తనకు టికెట్ ఇచ్చి గౌరవించాలని ఆమె చెప్తున్నారు. శ్రీకాంతాచారి ఎప్పుడూ కేసీఆర్ ఫొటో చూసే లేచేవాడని గుర్తుచేసిన శంకరమ్మ కేసీఆర్‌ తమను ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీద పోటీ చేయడమంటే సాహసమేనని చెప్పుకొచ్చారు. అయినా కేసీఆర్ సూచనను గౌరవించి పోటీ చేశానని వెల్లడించారు శంకరమ్మ.
తనకు నియోజకవర్గంలో పార్టీ నుంచి సపోర్ట్ ఉందని పార్టీ శ్రేణులు తనకు సహకరిస్తారని శంకరమ్మ తెలిపారు. అయితే పార్టీతో సంబంధం లేని ఎన్నారై తనకు పోటీగా వస్తున్నాడని మండిపడిన శంకరమ్మ మరోసారి సర్వే చేసి తనకు టికెట్ ఇవ్వాలని టీఆర్ఎస్ బాస్ కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఒకవేళ తనకు ఇవ్వడం కుదరకపోతే అప్పిరెడ్డికిచ్చినా అభ్యంతరం లేదని తేల్చిచెప్పారు. నియోజకవర్గంలో ఏడు మండలాల పార్టీ అధ్యక్షులు, ముగ్గురు ఎంపీపీలు తమకు మద్దతిస్తున్నారని ప్రకటించారు. లేదని ఎన్నారై కి ఇస్తే మాత్రం ఊరుకునేది లేదని తేల్చి చెప్పారు శంకరమ్మ .

#Shankaramma #LatestTelanganaPolitics #TelanganaPolitics #TelanganaElections #HuzurNagarTicketToShankaramma