ఇర్ఫాన్ ఖాన్ కి వింత వ్యాధి !

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై తమ అద్భుతమైన నటనతో అబ్బుర పరిచే నటులు చాలా అరుదుగా ఉన్నారు. అలాంటి వారిలో ఇర్ఫాన్ ఖాన్ ఒకరు. తెలుగు ఇండస్ట్రీలో ఆ మద్య మహేష్ బాబు నటించిన సైనికుడు సినిమాలో విలన్ గా నటించిన నటుడు ఇర్ఫాన్ ఖాన్. తాజాగా తనకు ఓ అరుదైన వ్యాధి వచ్చిందని స్వయంగా తానే ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

రోగ నిర్ధారణకోసం మరిన్ని పరీక్షలు చేయించుకుంటున్నట్టు తెలిపాడు. సోషల్ మీడియాలో ఎప్పుడు ఎదో ఒక పాజిటివ్ పోస్ట్ చేసే ఇర్ఫాన్ మొదటి సారి ఆయన ఫ్యాన్స్ ని షాక్ కి గురిచేశాడు. తనకు అరుదైన వ్యాది ఉందని..”కొన్నిసార్లు మీరు నిద్రపోతున్న జీవితాన్ని మీరు ఊరేగింపుతో మేల్కొంటారు. గత పదిహేను రోజులు నుంచి నా జీవితం సస్పెన్స్ కథగా ఉంది. అరుదైన కథల కోసం నా అన్వేషణ నాకు చాలా అరుదైన వ్యాధిని కలిగించిందని అర్ధమయింది.

నేను ఎప్పుడు రేర్ కదలకోసమే వెతుకులాట ప్రారంభించాను దీనిపై కూడా అలాగే పోరాడతాను.. నా కుటుంబం మరియు మిత్రులు నాతో ఉన్నారు సాధ్యమైనంత త్వరగా దీని పని చూస్తాం.. వారానికో పదిరోజులకో రోగ నిర్ధారణతో వస్తాము. అప్పుడు చెప్తాను” అంటూ ట్వీట్ చేశాడు.

ఆయన సింపుల్ నటనలోనే ఎదో తెలియని మాయ ఉంటుంది. కనుసైగలతో ప్రేమను అలాగే క్రూరత్వాన్ని తెరపై చూపించగలరు. ఇర్ఫాన్ ఖాన్ ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా నటించారు. హాలీవుడ్ తెరపై కూడా ఇర్ఫాన్ ఖాన్ తన నటనతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు.