ఆసియా కప్‌ మనదే…ఉత్కంఠ పోరు లో భారత్ దే విజయం …!

 Asia Cup 2018 , trendingandhra

ది.టీమ్‌ఇండియా ఆసియా విజేతగా నిలిచింది. శుక్రవారం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్లో 3 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్‌పై విజయం సాధించింది. స్పిన్నర్లు కుల్‌దీప్‌ యదవ్‌ (3/45), కేదార్‌ జాదవ్‌ (2/41), చాహల్‌ (1/31) అద్భుతంగా బౌలింగ్‌ చేయడంతో మొదట భారత్‌.. బంగ్లాను 48.3 ఓవర్లలో 222 పరుగులకే కట్టడి చేసింది.

Asia-Cup-2018,India-vs-Bangladesh , trendingandhra

లిటన్‌ దాస్‌ (121; 117 బంతుల్లో 12×4, 2×6) విలువైన శతకం సాధించాడు. రోహిత్‌ శర్మ (48; 55 బంతుల్లో 3×4, 3×6), దినేశ్‌ కార్తీక్‌ (37; 61 బంతుల్లో 1×4, 1×6), ధోని (36; 67 బంతుల్లో 3×4), కేదార్‌ జాదవ్‌ (23 నాటౌట్‌), జడేజా (23), భువనేశ్వర్‌ (21) రాణించడంతో లక్ష్యాన్ని భారత్‌ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. లిటన్‌ దాస్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా, శిఖర్‌ ధావన్‌ ‘మ్యాన్‌ ఆఫ్‌ ద టోర్నీ’గా ఎంపికయ్యారు.