భారత్ కి ముచ్చెమటలు పట్టించిన అఫ్ఘానిస్థాన్‌ …..మ్యాచ్ టై..!

india vs afghanistan ,asia cup , asia cup 2018 , trendingandhra

ఫైనల్‌ మ్యాచ్‌లో కూడా ఇంత ఉత్కంఠ ఉంటుందో.. లేదో మరి . సన్నాహకంగా అనుకున్న మ్యాచ్‌ కాస్తా భారత్‌కు చుక్కలు చూపించింది ఆఫ్ఘన్ . బ్యాటింగ్‌.. బౌలింగ్‌.. ఫీల్డింగ్‌లో అద్వితీయ ప్రదర్శన చేసిన అఫ్ఘానిస్థాన్‌ మరోసారి ఆఖరి ఓవర్‌ వరకు పోరాడింది. కానీ ఈసారి మాత్రం ఓడిపోలేదు.. అటు భారత్‌ కూడా గెలిచింది లేదు.. రెండు బంతుల్లో ఒక్క పరుగు కావాల్సిన స్థితిలో జడేజా గాల్లోకి బంతిని లేపి ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. దీంతో మ్యాచ్‌ అనూహ్యంగా టై అయ్యింది.

india vs afghanistan asai cup 2018 , india vs afghanistan, trendingandhra

ఆసియా కప్‌లో భాగంగా జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌ సంచలన రీతిలో ముగిసింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో అఫ్ఘానిస్థాన్‌ అద్భుతంగా పోరాడి భారత్‌తో మ్యాచ్‌ను టైగా ముగించింది. రాహుల్‌ (60), రాయుడు (57) అర్ధ సెంచరీలో రాణించినా ఆఖర్లో భారత్‌ తడబడింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అఫ్ఘాన్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 252 పరుగులు చేసింది. మహ్మద్‌ షెహజాద్‌ (116 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 124) మహ్మద్‌ నబీ (64) అర్ధ సెంచరీ చేశాడు. జడేజాకు మూడు, కుల్దీ్‌పకు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత లక్ష్యం కోసం బరిలోకి దిగిన భారత్‌ 49.5 ఓవర్లలో సరిగ్గా 252 పరుగులకు ఆలౌటయింది. దినేశ్‌ కార్తీక్‌ (44), జడేజా (25) ఫర్వాలేదనిపించారు. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ షెహజాద్‌కు దక్కింది.