సేల్ఫీలకు ఇక జగన్ దూరమే..?

jagan,jagan mohan reddy,ys jagan,trendingandhra

ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ సెల్ఫీలకు దూరమయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటీవల విశాఖ విమానాశ్రయంలో తనపై దాడి జరిగిన ఘటన తర్వాత జగన్ భద్రత విషయంలో ఆయన ప్రజల్లోకి వెళ్ళే విషయంలో భద్రతా సిబ్బంది ఇక కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదు అనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇటీవల ప్రజల్లోకి వెళ్తున్న సమయంలో జగన్ వారితో సెల్ఫీలకు ప్రాధాన్యత ఎక్కువగా ఇస్తూ వస్తున్నారు. అయితే విశాఖ విమానాశ్రయంలో జగన్ పై దాడి జరగడం భద్రతా వైఫల్యమే అనే అభిప్రాయలు ఉన్నాయి. దీనితో భద్రతా సిబ్బంది తమ మీద ఆరోపణలు రాకుండా జాగ్రత్త పడే అవకాశం ఉంది అంటున్నాయి రాజకీయ వర్గాలు. పాదయాత్రలో చేసినా బహిరంగ సభ అయినా సరే జగన్ వద్ద ఒక భద్రతా వలయం ఉంటుందని దానిని ధాటి ప్రజలకు ఆయనకు ముద్దులు ఇవ్వడానికి భద్రతా సిబ్బంది కూడా ఒప్పుకునే అవకాశాలు లేవని సమాచారం.

#Jagan #YsJagan  #JaganMohanReddy #JaganNews