కెటిఆర్ సీఎం అవుతారా…!

KTR ,CM , TrendingAndhra

తెలంగాణ మంత్రి కెటిఆర్ ముఖ్యమంత్రి కెసిఆర్ వారసత్వం అందిపుచ్చుకోవడానికి సిద్దం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇటీవలికాలంలో ఆయనకు పార్టీలో, ప్రభుత్వంలో లబిస్తున్న ప్రాదాన్యత, ఆయన నిర్వహిస్తున్న వివిధ కార్యకలాపాలు, ప్రతిపక్షాల విమర్శలకు కెటిఆర్ ఇస్తున్న సమాదానాలు..ఇవన్ని కాబోయే సి.ఎమ్. అన్న సంకేతాలు ఇస్తున్నాయని ఒక ఆంగ్ల పత్రిక విశ్లేషించింది.

ktr , TrendingAndhra

గతంలో బిజెపి అద్యక్షుడు అమిత్ షా విమర్శలు చేయగా, కెసిఆర్ స్వయంగా సమాదానం ఇచ్చారు. కాని ఈసారి కెటిఆర్ జవాబు ఇచ్చారు. కొండగట్టు ప్రమాదం బాదితులను పరామర్శించడానికి కెటిఆర్ వెళ్లారు. ప్రగతి నివేదన సభ నిర్వహణలో కెటిఆర్ అన్నీ తానై వ్యవహరించారు. కాగా మంత్రి హరీష్ రావు కూడా కెటిఆర్ ముఖ్యమంత్రి అయితే కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు.

టిఆర్ఎస్ అదికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే కెటిఆర్ సి.ఎమ్.అవుతారా?లేక లోక్ సభ ఎన్నికలలో పోటీచేసి కెసిఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్లిన తర్వాత సి.ఎమ్ అవుతారా అన్నదే తేలవసలి ఉందని రాజకీయ వర్గాలు విశ్లేసిస్తున్నాయి.