కోదండ‌రామ్ ని వాడుకోవటంలో కాంగ్రెస్ హై కమాండ్ వ్యూహం అదేనా ?

congress high command,congress in telangana,kodandaram tjs in telangana,telangana politics,mahakutami in telangana,trendingandhra

కాంగ్రెస్ హై కమాండ్ చాలా వ్యూహాత్మకంగా ఆలోచిస్తుంది. అంతే వ్యూహాత్మకంగా వ్యవహరించమని రాష్ట్ర నాయకులకు సూచిస్తుంది. టీజేఎస్ అధ్యక్షుడు కోదండ‌రామ్ విషయంలో కూడా పలు సూచనలు చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం ఆయనను సాధ్యమైనంత ఎన్నికలకోసం వాడుకోవాలని సూచించింది. మహాకూటమితో కలిసి ఎన్నికల బరిలోకి వెళ్లనున్న కోదండ‌రామ్ రాహుల్ గాంధీ తో భేటీ తర్వాత హై కమాండ్ ఈ నిర్ణయం తీసుకుంది.
కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం వెనుక కచ్చితమైన కారణం వుంది. ఈ నేపధ్యంలోనే రాహుల్ గాంధీ తెలంగాణా కాంగ్రెస్ అధినాయకత్వానికి కోదండ‌రామ్ సేవలు వాడుకోవాలని సూచించారు. ప్రచారానికి సమయం తక్కువగా ఉన్న నేపధ్యంలో కోదండ‌రామ్ ను వీలైనన్ని సభల్లో ప్రాధాన్యత ఇచ్చి మాట్లాడించాలని ముఖ్యంగా జిల్లాల్లో నిర్వహించే సభలకు తప్పనిసరిగా తీసుకెళ్లాలని చెప్పారు. ఆయన చేత టీఆర్ఎస్ గురించి జనాలకు చెప్పిస్తే ఆ ఇంపాక్ట్ వేరేలా ఉంటుందని,ఆయన సేవలను ప్రభావవంతంగా వాడుకోవాలని హై క‌మాండ్ సూచన చేసింది. రాబోయే రోజుల్లో పార్టీ చేప‌ట్టే ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో కోదండ‌రామ్ ను ముందుంచి న‌డపాల‌ని చెప్పినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క లతో పాటు ఆయనకు ప్రాధాన్యతనివ్వాలని చెప్పింది.
కోదండ‌రామ్ మాట్లాడితే టీఆర్ఎస్ నాయకుల నుండి ప్రతి స్పందన రాదన్నది కాంగ్రెస్ భావన.రేవంత్ రెడ్డి, విజయశాంతి ఎవరు మాట్లాడినా తిరిగి కౌంటర్ ఇచ్చే గులాబీ నాయకులు కోదండరామ్ విషయంలో ఆ విధంగా స్పందించే అవకాశం లేదు. . కోదండ‌రామ్ విమ‌ర్శ‌ల్ని కేసీఆర్ తో సహా ఎవరూ అంత ఈజీగా ఎవ్వరూ తీసి పారేయ్యరు ..తెలంగాణా ఉద్య‌మంలో మేధావి వ‌ర్గానికి చెందిన వ్యూహ‌క‌ర్త‌గా కోదండరామ్ కి ఉన్న ప్రాధాన్య‌త అంతా ఇంతా కాదు . అదీ కాక కోదండ‌రామ్ చాలా మంచివాడు అన్న భిప్రాయం అందరిలో ఉంది. అందుకే, ఆయ‌న్ని అంత ఈజీగా విమ‌ర్శించే ప్ర‌య‌త్నం తెరాస నేత‌లు చెయ్య‌రు. కాబ‌ట్టి,కాంగ్రెస్ పార్టీ ఈ అంశాన్ని త‌మ‌కు అనుకూలంగా మార్చుకోవాలనే ఈ నిర్ణయం తీసుకుంది. కోదండరామ్ ను ము