చంద్రబాబు కేంద్రానికి షాక్ ఇచ్చే అవకాశం ఉందా..?

chandrababu , trendingandhra

ఇప్పుడు జాతీయ రాజకీయాల్లోకి చంద్రబాబు వెళ్తున్నారు అనే ప్రచారం జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. కేంద్రంపై యుద్ధం మొదలుపెట్టిన చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు. శుక్రవారం జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. ‘నన్ను తక్కువగా అంచనా వేయొద్దు… రేపటి నుంచి ఏం జరుగుతుందో మీరే చూస్తారంటూ’.. వ్యాఖ్యానించారు.

chandrababu naidu,trendingandhra

దీనిపై అనేక ఆసక్తికర చర్చలు వినపడుతున్నాయి. చంద్రబాబు కేంద్రానికి షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ లో జాతీయ పొత్తులపై మాట్లాదే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అటు ప్రధాని నరేంద్ర మోడీ సైతం ఈ పర్యటనపై దృష్టి సారించారని ఇప్పటికే జాతీయ మీడియా కు కొన్ని ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తుంది. చంద్రబాబు ఇప్పుడు ఏం మాట్లాడతారు అనే దానిపైనే అందరి ఆసక్తి నెలకొంది.

#IsThereAnyChancetoChandrababuGiveShockToCentralGovernment #Chandrababu #ChandrababuNaidu #NchandrababuNaidu