టార్గెట్ గంటా శ్రీనివాసరావు..?

ganta srinivasa rao , trendingandhra

విశాఖలో ఐటి దాడులకు ఐటి అధికారులు రంగం సిద్దం చేసుకున్నారు. భారిగా దాడులు చేయడానికి బుధవారం సాయంత్రమే విశాకకు పలు మార్గాల నుంచి చేరుకున్న అధికారులు గురువారం ఉదయమే దాడులు చేయడానికి గాను సిద్దమయ్యారు. ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్న పలువురు ఆర్ధికంగా బలంగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని సోదాలు చేయడానికి సిద్దమయ్యారు.

ganta-srinivasa-rao,trendingandhra

అదే విధంగా నెల్లూరు , విజయవాడ, చిత్తూరు సహా ఇతర ప్రాంతాల్లో కూడా దాడులు చేయడానికి సిద్దమయ్యారు. అయితే విశాఖ దాడుల విషయంలో మంత్రి గంటా శ్రీనివాసరావు ని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. గంటా లక్ష్యంగా దాడులు చేయడానికి కేంద్రం వ్యూహం ఇచ్చిందని అందుకే ఆయన సన్నిహితంగా ఉన్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. కాగా ఇటీవల రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ పై దాడులు చేసిన సంగతి తెలిసిందే.

#ITOfficersTargetsGantaSrinivasaRao #ITRaids #GantaSrinivasaRao