ఐటీ దాడుల్లో అడ్డంగా బుక్కైన సీఎం రమేష్‌..!

it raids on cm ramesh house,tdp mp cm ramesh,tdp mp,tdp,it raids on cm ramesh,it ramesh booked in it raids

టీడీపీ ఎంపీ సీఎం రమేష్ ఇంటి పై ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. కడప జిల్లాలో పోట్ల దుర్తిలోని తన ఇంటి పై కూడా అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే హైదరాబాద్ లోని రమేష్ ఇంటి పై 10 మంది ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ఈదాడులని ఏక కాలంలో 25 నుంచి 30 చోట్ల 100 మంది ఐటి అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం సీఎం రమేష్ ఢిల్లీలో ఉన్నారు. ఆయన చూపించిన ఆదాయానికి, లెక్కలకు పొంతన లేకపోవడంతో ఐటీ అధికారులు సోదాలు చేపట్టినట్టు తెలుస్తోంది. ఆస్తుల పత్రాలు, ఇతర డాక్యుమెంట్లను అధికారులు తనిఖీ చేస్తున్నారు.

ఈరోజు ఉదయం 8 గంటల సమయంలో పోట్లదుర్తిలోని సీఎం రమేశ్‌ నివాసానికి 15 మంది ఐటీ అధికారులు వెళ్లారు . ఆ సమయంలో రమేశ్‌ సోదరుడు సీఎం సురేశ్‌ మాత్రమే ఇంట్లో ఉన్నారు. అధికారులు ఆయన్ని ఇంటి నుండి బయటకి పంపి , ఇంటి తలుపులు మూసివేశారు. ప్రస్తుతం ఐటీ అధికారులు అన్ని గదుల్లోనూ తనిఖీలు చేపడుతూ పలు దస్త్రాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది . అలాగే జూబ్లీహిల్స్‌లోని సీఎం రమేశ్‌ నివాసంతో పాటు ఆయనకు చెందిన రుత్విక్‌ అనే సంస్థ కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదా నిర్వహిస్తున్నారు .

తనపై జరుగుతున్నా ఈ ఐటీ దాడుల గురించి స్పందించిన సీఎం రమేష్ ” కడప ఉక్కు ఫ్యాక్టరీపై నిలదీస్తున్నందుకే నాపై ఐటి దాడులు చేస్తున్నారని మండి పడ్డారు. ఏపీలో పెట్టుబడులు పెట్టకుండా చేయాలని కేంద్రం కుట్రలు చేస్తుందన్నారు. నేను నిత్యం ట్యాక్స్ లు కడుతున్నామని రమేష్ తెలిపారు. కానీ తెలుస్తున్న సమాచారం ప్రకారం సి, రమేష్ ఇంట్లో కోట్ల కొద్దీ అక్రమ సొమ్ము ఉందని తెలుస్తుంది .

#ItRaidsOnCMRameshHouse #ItRaidsOnTdpMp #CMRameshTdpMP #APPolitics #APElections2019 #ITRaidsInAP