జబర్దస్త్ దొరబాబు పెళ్లి !

జబర్దస్త్ కామెడీ షోతో తెలుగు ప్రేక్షకులకి సుపరిచితమైన దొరబాబు వివాహం ఆదివారం అన్నవరంలో అట్టహాసంగా జరిగింది.

నెల్లూరుకి చెందిన యాంకర్‌ నందినితో గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న దొరబాబు.. ఇటీవల విషయం ఇంట్లో చెప్పడంతో ఇరు కుటుంబ సభ్యులు వీరి పెళ్లికి అంగీకరించారు. తూర్పుగోదావరి జిల్లా తొండంగి‌కి చెందిన దొరబాబు.. జబర్దస్త్‌లో హైపర్ ఆది స్కిట్స్‌లో ఎక్కువగా కనిపిస్తుంటాడు.

వీరి కాంబినేషన్‌లో పడే పంచ్‌లకి ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో..! నందిని.. నెల్లూరు పట్టణంలోని ఓ లోకల్ ఛానల్‌లో యాంకర్‌గా పనిచేస్తోంది. ఈ వివాహానికి జబర్దస్త్‌ కళాకారులు హైపర్ ఆది, రైజింగ్ రాజు, గణపతి, అప్పారావు, వినోదిని తదితరులు హాజరయ్యారు. వీరిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున ఆసక్తి కనబర్చడం విశేషం.