జగన్ దెబ్బకి బాబు ఢమాల్ …..!

jagan , chandrababu naidu,trendingandhra

సాధారణంగా ప్రతిపక్ష నేత జగన్ టీడీపీ చేసే ఆరోపణలపై పెద్దగా ఎక్కడ స్పందించరు. జగన్ పార్టీ వారి ద్వారానే కౌంటర్లు ఇప్పిస్తూంటారు. మరీ పదే పదే టార్గెట్ చేస్తే మాత్రం జగన్ అపుడు రంగంలోకి దిగుతారు. ఇపుడు అదే జరిగింది. బాబుకు, తమ్ముళ్ళకూ కూడా జగన్ కాస్త గట్టిగానే ఇచ్చాడు . ఏపీకి సీఎం ఎవరు బాబు అంటూ జగన్ వేసిన ప్రశ్న టీడీపీకి షాక్ లాంటిదే. ఎక్కడైనా ప్రక్రుతి విపత్తులు, ప్రమాదాలు జరిగినపుడు ముఖ్యమంత్రి హాజరు కావడం, సహాయ కార్యక్రమాలు చూడడం సాధారణమే కాదు. అది వారి విధ్యుక్త ధర్మం. మరి బాబు కూడా అదే చేశారు.

Jagan,trendingandhra

దానికి పెద్దగా ఆర్భాటం ఎందుకని జగన్ సూటిగానే టీడీపీ ని నిలదీశారు. తాను శ్రీకాకుళం తిత్లీ తుపాను బాధితులను పరామర్శించకపోవడాన్ని బాబు రాజకీయం చేయడాన్ని జగన్ తప్పు పట్టారు. తాను ప్రతిపక్ష నాయకున్ని మాత్రమేనని ఆయన చెప్పుకున్నారు. తానొచ్చి అక్కడ చేసేది ఏముందని కూడా అన్నారు. ప్రభుత్వం కదాలాల్సిన చోట వేగంగా కదలలేదని జగన్ విమర్శించారు. అందువల్లనే తిత్లీ తుపాను వల్ల వేల కోట్ల నష్టం సంభవించిందని చెప్పారు. ఆ తరువాత అక్కడకు వచ్చిన చంద్రబాబు సహాయం గురించి ఆలోచించకుండా రాజకీయం చేయడమేంటని జగన్ మండిపడ్డారు.

YS Jagan Mohan Reddy ,trendingandhra

ఎవరో రాలేదని, మరెవరో సాయం చేయలేదని అభాండాలు వేస్తున్న బాబు తాను అసలు ఏం చేశారో చెప్పాలంటూ జగన్ డిమాండ్ చేశారు. ఆఖరుకు బాబు తుపాను సాయాన్ని కూడా ప్రచారం కోసం వినియోగించుకుంటున్నారని జగన్ ఆరోపించారు. ఏదో చేసినట్లు జిల్లా అంతటా పెద్ద పెద్ద హోర్డింగులు పెట్టుకోవడం దేనికోసమని ఆయన నిలదీశారు. విపక్షాలను తిట్టడం ద్వారా తుపాను రాజకీయం చేయడం ధర్మమేనా అంటూ ప్రశించారు. మొత్తానికి జగన్ వేసిన ప్రశ్నలు బాబుకు గుక్క తిప్పుకోనీయనివే. ఇకనైనా జగన్ రాలేదని బాబు అనడం మానేస్తారేమో చూడాలి.

#JaganCountertoChandrababuNaidu #Chandrababu #Jagan