ఆమె కోసం జగన్ అంతపని చేశాడా

jagan ,trendingandhra
వైసీపీ అధినేత జగన్ ఆమె కోసం తనని నమ్మిన సీనియర్ నాయకుడికే చెక్ పెట్టాడు. ఆ ఎన్నారై కోసం ఎప్పటి నుండో ఆశలు పెట్టుకున్న ఆ నేతకు షాక్ ఇచ్చారు. దండిగా డబ్బున్న ఆమె కోసం అడిగిన వెంటనే టికెట్ ఇచ్చేసి అప్పటిదాకా పని చేసిన వ్యక్తిని పక్కన పెట్టాడు. ఇంతకీ ఆమె ఎవరు ? జగన్ ఎవరి కోసం ఇంత పని చేశారు? జగన్ చేసిన పనితో బాధ పడ్డ నాయకుడెవరో తెలుసుకోవాలంటే ఈ కథనం పై ఓ లుక్కెయ్యండి. చిలకలూరిపేటలో జగన్ ఆ మహిళా నేత కోసం రెడ్ కార్పెట్ పరిచారు. అమెరికాలో బిజినెస్ చేసి బోలెడంత సంపాదించి నిన్నా మొన్నటి దాకా టీడీపీలో ఉన్న ఆ నేత విడదల రజినీ … చిల‌క‌లూరి పేట‌లో విడ‌ద‌ల ర‌జ‌నీ గతంలో టీడీపీలో ఉన్నారు. విశాఖ మ‌హానాడులో మంత్రి పుల్లారావు ఆమెను సీఎంకు, సీనియ‌ర్ నేత‌ల‌కు ప‌రిచ‌యం చేసి పార్టీలో యాక్టీవ్ గా పని చేస్తున్నారు అని చెప్పారు.
 
vidadala rajini,trendingandhra
 
పార్టీ కోసం పని చేసినందుకు గుర్తింపుగా ఆమె మామ‌ గారికి మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ప‌ద‌వి ఇచ్చారు చంద్రబాబు. అయితే రజినీ ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. అందుకోసం కావాల్సిన పార్టీ ఫండ్ కూడా ఇస్తానని చెప్పింది. అయినా అక్కడ పని చేస్తున్న సౌమ్యుడు అయిన ప్రత్తిపాటి పుల్లారావును కాదని రజినీకి టికెట్ ఇచ్చే అవకాశం లేదని చంద్రబాబు చెప్పటంతో జగన్ కు రాయబారం పంపింది రజినీ. ఎన్నారై అయిన రజినీ అమెరికాలో వ్యాపారం చేయ‌డంతో వంద‌ కోట్ల రూపాయ‌లు ఉండ‌టం వల్ల వెంటనే అక్కడ పని చేస్తున్న మర్రి రాజశేఖర్ ను కాదని ఆమెకు టిక్కెట్ ఇచ్చారు జ‌గ‌న్.. దీంతో వైసీపీలో సొంత పార్టీ నేతలే జగన్ తీరుకు షాక్ తిన్నారు. ఆమె కోసం జగన్ ఇంత పని చేశాడేమిటి అని అవాక్కయారు. మర్రి రాజశేఖర్ మాత్రం తనకు జరిగిన అన్యాయానికి ఏం చెయ్యాలో పాలుపోక పక్క పార్టీల వంక చూస్తున్నట్టు తెలుస్తుంది.
 
#JaganGaveMLATickettoVidadalaRajini #VidadalaRajini #Jagan