ఏదైనా జగన్ లాజిక్ ఏ వేరు…

jagan , ys jagan , trendingandhra

ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత జగన్ కి సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు కోర్టు విచారణకు మినహాయింపు ఇచ్చింది. గురువారం హైదరాబాద్ రావడానికి గాను జగన్ విజయనగరం లో పాదయాత్ర ముగించుకుని వచ్చి విశాఖ విమానాశ్రయంలో హైదరాబాద్ విమానానికి ఎదురు చూస్తుండగా ఒక వ్యక్తి జగన్ పై దాడి చేసారు. ఈ దాడిలో జగన్ భుజానికి గాయం అయింది. దీనితో ఆయన అక్కడి నుంచి నేరుగా హైదరాబాద్ చేరుకొని బంజారాహిల్స్‌ రోడ్ నెంబర్ 12లో ఉన్న సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స పొందారు. విశాఖలో వైద్యం అనంతరం ఆయన హైదరాబాద్ వెళ్ళారు. నేడు ఆయనను వైద్యులు డిశ్చార్జ్ చేసారు. అయితే ఈ సందర్భంగా జగన్ వ్యవహార శైలిపై ఇప్పుడు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోర్ట్ టైం అలా అయిపోయిందో లేదో జగన్ డిశ్చార్జ్ అయ్యారు. దీనిపై సోషల్ మీడియాలో సైతం పలువురు తీవ్ర స్థాయిలో కామెంట్లు చేస్తున్నారు.