90వ రోజు జగన్‌ ప్రజాసంకల్ప పాదయాత్ర..!

ప్రజాసంకల్పయాత్ర పేరిట విపక్ష నేత వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్వహిస్తున్న పాదయాత్ర శనివారం నాటికి 90వ రోజుకు చేరింది.

ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో పాదయాత్ర కొనసాగుతోంది. నేడు లింగసముద్రం మండలం బంగారక్కపాలెం నుంచి జగన్‌ పాదయాత్రను ప్రారంభించనున్నారు. గాంధీనగర్, వలేటివారిపాలెం,

రోళ్లపాడు, పోలినేనిపాలెం ఉప్పలపాడు, కునిపాలెం క్రాస్‌రోడ్డు, పోకూరు మీదుగా జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది.

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు 3వేల కిలోమీటర్లు ఆరునెలలపాటు జగన్ పాదయాత్రను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే రాయలసీమ లో ని నాలుగు జిల్లాలో యాత్ర ను ముగించుకున్న,నెల్లూరు జిల్లాలో లో నిన్న నే పాదయాత్ర ముగిసింది.