జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర @365 డేస్ ….!

jagan praja sankalpa yatra,jagan praja sankalpa yatra live,jagan padayatra live status,trendingandhra

రాష్ట్ర ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేరిట చేపట్టిన పాదయాత్రకు నేటితో ఏడాది పూర్తవుతోంది. 2017 నవంబరు 6న కడప జిల్లా ఇడుపులపాయలో జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తూ ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసితోనే తాను ప్రజా సంకల్ప యాత్ర చేపట్టినట్లు చెప్పారు. అలా మొదలూన జగన్ పాదయాత్ర గడచిన 12నెలల కాలంలో ఎన్నో మైలురాళ్లను అధిగమిస్తూ 11 జిల్లాల గుండా సాగి ప్రస్తుతం 12వ జిల్లాలో కొనసాగుతోంది.

2017,నవంబర్ 6 న ఇడుపుల‌పాయలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఘాట్ వ‌ద్ద‌ విజ‌య‌మ్మ‌, ష‌ర్మిలతో కలసి జగన్ నివాళులు అర్పించిన అనంతరం తన ప్రజాసంకల్ప యాత్రను ప్రారంభించారు. పాదయాత్ర ఆరంభం సందర్భంగా జగన్ మాట్లాడుతూ… .”చంద్రబాబు మాదిరిగా నాకు కాసులంటే కక్కుర్తి లేదు.. కేసులకు భయపడే ప్రసక్తి లేదు…నాకున్నది ఒక్కటే కసి.. అది నేను చనిపోయిన తరువాతా ప్రతి పేదవాడి గుండెల్లో బతకాలన్న కసి, ప్రజల కుటుంబాల్లో ఆప్యాయతలు పంచాలన్నదే నా కసి, ఆ కసి నాలో ఉంది కాబట్టే ప్రజలకు, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను. అభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌గా మార్చాలన్నదే నా కసి”…అని చెప్పారు.

గడచిన ఏడాది కాలంలో జగన్ కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమగోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం జిల్లాల గుండా పాదయాత్రను కొనసాగించి ప్రస్తుతం విజయనగరం జిల్లాలో పర్యటన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్టోబర్ 25 వ తేదీన పాదయాత్ర నుంచి హైదరాబాద్‌కు బయల్దేరగా విశాఖ విమానాశ్రయంలో కోడి కత్తితో హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడి నుంచి ప్రాణహాని లేకుండా తృటిలో బైటపడిన జగన్ ఆ క్రమంలో భుజానికి గాయం కావడంతో వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నారు.

ఈ ఏడాది కాలంలో జగన్ ప్రజా సంకల్పయాత్ర…పాదయాత్ర చరిత్రలోనే సరికొత్త రికార్డులు నమోదు చేస్తూ పలు మైలు రాళ్లను అధిగమిస్తూ కొనసాగుతోంది. సెప్టెంబర్ 24 న విజయనగరం జిల్లాలో అడుగిడిన అభిమాన నేత పాదయాత్ర అదే రోజున 3000 కిలోమీటర్లు పూర్తి చేసుకోగా అక్టోబర్ 24 న సాలూరు మండలం బాగువలస వద్ద 3200 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మరో మైలురాయి చేరుకున్నారు. ఇందుకు గుర్తుగా దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని జగన్‌ ఆవిష్కరించి, మొక్కను నాటి తమ పార్టీ జెండాను ఎగురవేసి ముందుకు సాగారు.

పాదయాత్రలో తనను చూసేందుకు,కలిసేందుకు భారీగా పోటెత్తుతున్న జనాల తీరు కొన్ని సందర్భాల్లో రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యంలో ముంచెత్తే స్థాయిలో ఉందంటే అతిశయోక్తిలేదు. భారీగా తరలివస్తున్న మహిళలు, యువకులు ఆయనతో సెల్ఫీలు తీసుకోవడానికి ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది సెల్ఫీలు తీసుకున్నారు. ఇలా పాదయాత్రతో ప్రజలతో మమేకమవుతూ వారి కష్టనష్టాలను, సాధకబాధకాలను ఓపిగ్గా వింటూ.. భరోసా ఇస్తూ సాగిపోతున్న జగన్ పై అక్టోబర్ 25న విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నం జరిగింది. తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకొని మళ్లీ పాదయాత్ర కొనసాగించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

#JaganPadayatraLiveStatus #JaganPrajaSankalpaYatra #JaganPrajaSankalpaYatra